కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన జూనియర్ డాక్టర్లు

కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించాలని

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 03:20 PM IST
కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన జూనియర్ డాక్టర్లు

కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించాలని

కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. మార్చి 31 నుంచి విధులకు దూరంగా(silent boycott) ఉంటామని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి(డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) జూనియర్ డాక్టర్ల అసోషియేషన్ ఓ నోటీసు పంపింది. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే వైద్య సేవలు అందించే తమకు సరైన సౌకర్యాలు లేవని జూనియర్ డాక్టర్లు వాపోతున్నారు. కరోనా సోకకుండా సరిపడా మాస్కులు, పరకరాలు, గ్లోవ్స్, కోట్లు, ట్రాన్స్ పోర్టేషన్, వసతి సదుపాయం ప్రభుత్వం తమకు ఇవ్వలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము రిస్క్ తీసుకోలేమని చెప్పారు. దీని గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. 

ఈ క్రమంలోనే మరో దారి లేని పరిస్థితుల్లో, విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు జూడాలు తెలిపారు. వైద్య సేవలు అందించే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తమకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని జూనియర్ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. చూస్తూ చూస్తూ తమ జీవితాలను ప్రమాదంలో పడేసుకోలేము అన్నారు.

అసలే ఓ వైపు కరోనా విజృంభిస్తోంది. ఇప్పుడు వైద్య సేవలు చాలా అవసరం. కరోనా పేషెంట్లకు ట్రీట్ మెంట్ అందించడంలో వారిది కీలక పాత్ర. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను ఫేస్ చేసేందుకు, వైద్య సేవలు అందించడానికి రిటైర్డ్ వైద్య సిబ్బందిని కూడా ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ఇలాంటి సిట్యుయేషన్ లో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

జూనియర్ డాక్టర్ల డిమాండ్లు:
* పీపీఈ, రక్షణ పరికరాలు ఇవ్వాలి
* ఐసోలేషన్ వార్డుల్లో పని చేసే డాక్టర్లకు సమీపంలోని హాస్టల్స్ లో వసతి సౌకర్యం కల్పించాలి
* హెల్డ్ కేర్ ప్రొవైడర్లకు రవాణ సౌకర్యం కల్పించాలి
* ప్రతి హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కి prophylaxis సరఫరా చేయాలి 

jd1
 

jd2

Also Read | పేదల అకౌంట్లలో 611కోట్లు జమ చేసిన యోగి ఆదిత్యనాథ్