కాచిగూడ రైలు ప్రమాదం : లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం

కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 05:47 AM IST
కాచిగూడ రైలు ప్రమాదం : లోకో పైలట్ చంద్రశేఖర్ పరిస్థితి విషమం

కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎంఎంటీఎస్ లోకో పైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు రైళ్ల మధ్యలో చిక్కుకున్న చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని దాదాపు 8గంటలకు పైగా శ్రమించి రెస్క్యూటీం కాపాడింది. కేర్ ఆసుపత్రికి తరలించింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చంద్రశేఖర్‌ కు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. అతడి రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుందని ప్రకటించిన కేర్‌ ఆసుపత్రి వైద్యులు.. కొద్ది సేపటి క్రితమే అతడికి సర్జరీ ప్రారంభించారు. 

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందరికీ.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అన్ని విభాగాల డాక్టర్లు.. అందుబాటులో ఉండి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
 
ఈ ప్రమాదంతో.. నగరవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం విషయం తెలిసిన 10 నిమిషాల్లోపే.. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే.. సహాయచర్యలు ప్రారంభించి.. గాయపడ్డవారిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. తర్వాత.. ఫలక్‌నుమా నుంచి కాచిగూడకు వచ్చే రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపేశారు. నేటి మధ్యాహ్నం కల్లా ట్రాక్‌ను క్లియర్‌ చేసి రైల్వే సేవలను పునరుద్దరించేందుకు పనుల్లో వేగం పెంచారు.