కేసీఆర్ పేరుతో మరో పథకం

కేసీఆర్ పేరుతో మరో పథకం ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కేసీఆర్ ఆపద్బంధు పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించిందన్నారు.

  • Published By: veegamteam ,Published On : February 27, 2020 / 01:56 PM IST
కేసీఆర్ పేరుతో మరో పథకం

కేసీఆర్ పేరుతో మరో పథకం ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కేసీఆర్ ఆపద్బంధు పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించిందన్నారు.

కేసీఆర్ పేరుతో మరో పథకం ప్రవేశ పెడుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కేసీఆర్ ఆపద్బంధు పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించిందన్నారు. గురువారం (ఫిబ్రవరి 27, 2020) అన్ని జిల్లాల బీసీ సంక్షేమ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ చదువుకున్న నిరుద్యోగ యువతులకు నిఫ్ట్‌ ద్వారా శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. 

ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు అంబులెన్స్‌లు అందజేయనున్నట్లు చెప్పారు. ఐదుగురు యువత ఒక గ్రూప్‌గా అంబులెన్స్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద జిల్లాకొక అంబులెన్స్‌ను కేటాయించనున్నట్లు తెలిపారు. 10 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం పథకం అమలు చేస్తామని తెలిపారు. 11 సమాఖ్యల ద్వారా వివిధ వృత్తుల వారికి ఆయా రంగాల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. 

బీసీ విద్యార్థుల భవిష్యత్‌ కోసం అధికారులు కలిసి పనిచేయాలన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు వసతి గృహాలను సందర్శించాలని మంత్రి అన్నారు. సంక్షేమ వసతిగృహాల ప్రగతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిచనున్నట్లు తెలిపారు.