స్టాలిన్‌ బిజీ బిజీ: కేసిఆర్‌తో సమావేశం లేనట్లేనా?

  • Published By: vamsi ,Published On : May 7, 2019 / 10:22 AM IST
స్టాలిన్‌ బిజీ బిజీ: కేసిఆర్‌తో సమావేశం లేనట్లేనా?

దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్‌తో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్‌ వరుసగా దక్షిణాది నేతలను కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటి అయిన కేసిఆర్.. దక్షిణాదిలోని ముఖ్యమైన నాయకులతో వరుసగా భేటి అవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మే 13న తమిళనాడులోని కీలక పార్టీ డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అవ్వాలని భావిస్తున్నారు.

అయితే కేసీఆర్‌తో సమావేశం అయ్యేందుకు స్టాలిన్ నిరాకరించినట్లు తెలుస్తుంది. మే 13వ తేదీన ప్రచారంలో బిజీగా ఉన్నానని స్టాలిన్ చెప్పినట్లు తెలుస్తుంది. చివరి విడత ఎన్నికలు మే 19న ఉండగా.. ఆ ఎన్నికలలో బిజీగా ఉన్నానని స్టాలిన్ చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే డీఎంకే ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉండగా.. కేసిఆర్‌తో భేటి విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తుండగా.. దక్షిణాది పార్టీలను కూడగట్టాలని కేసిఆర్ చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలితం ఇస్తాయో వేచిచూడాలి.