సరిలేరు సారుకెవ్వరు : ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ సక్సెస్

ఉద్యమ సారథి... పాలనాదక్షుడిగా సక్సెస్‌ అవుతాడా..? నో డౌట్‌... అవుననే నిరూపించారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలా నెరవేర్చారో.. అదే స్ఫూర్తితో ఒక

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 05:28 AM IST
సరిలేరు సారుకెవ్వరు : ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ సక్సెస్

ఉద్యమ సారథి… పాలనాదక్షుడిగా సక్సెస్‌ అవుతాడా..? నో డౌట్‌… అవుననే నిరూపించారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలా నెరవేర్చారో.. అదే స్ఫూర్తితో ఒక

ఉద్యమ సారథి… పాలనాదక్షుడిగా సక్సెస్‌ అవుతాడా..? నో డౌట్‌… అవుననే నిరూపించారు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. స్వరాష్ట్ర ఆకాంక్షను ఎలా నెరవేర్చారో.. అదే స్ఫూర్తితో ఒక ముఖ్యమంత్రిగా బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారు. తిరుగులేని సంక్షేమ పథకాలతో దేశమంతా తనవైపు తిప్పుకునేలా చేస్తున్నారు. అకుంఠిత దీక్షా దక్షతలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌.. 66వ జన్మదినాన్ని ఇవాళ (ఫిబ్రవరి 17,2020) జరుపుకుంటున్నారు.

గాంధీ బాటలో కొట్లాడి.. స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ధీశాలి:
ఒక లక్ష్యం కోసం ఉద్యమాన్ని ప్రారంభించి.. ఆ ఉద్యమ ఫలితాన్ని కళ్లారా చూడటం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. గాంధేయవాదాన్ని నమ్మిన కేసీఆర్‌.. ఏనాడు సహనం కోల్పోలేదు. తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడానికి తానే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని 11 రోజుల పాటు దీక్షకు దిగారు. 14ఏళ్ల అలుపెరగని పోరాటంతో స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేశారు. ఉద్యమ సింహంగా 2014-ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్‌కు జనం బ్రహ్మరథం పట్టారు. 63స్థానాలే దక్కినా గులాబీ నేత బాధపడలేదు. ప్రజాభిమానాన్ని పొందాలంటే ఉత్తమమైన పాలన అందించడమే మార్గంగా భావించారు. అణగారిన తెలంగాణను బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లారు. సాగు, తాగునీరు కంటే ముందు విద్యుత్‌పైనే ఫోకస్‌ పెట్టారు. ఆ కొరతను అధిగమించి తన విజన్‌ ఏంటో చెప్పకనే చెప్పేశారు. లాండ్‌ అండ్‌ ఆర్డర్‌కు పెద్దపీట వేసి… పెట్టుబడులకు ఢోకా లేకుండా చేసి తన దూరదృష్టిని చాటుకున్నారు. స్పాట్.. 

మిషన్ కాకతీయతో చెరువులకి జలకళ:
బంగారు తెలంగాణలో భాగంగా 80వేల కోట్లతో కాళేశ్వరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, సీతారామ సాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టులాంటివి పురుడుపోసుకున్నాయి. మిషన్ కాకతీయ పథకంతో వేలాది చెరువులు జలసిరులతో కళకళలాడాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు సమాంతరంగా సాగించారు. ఈ పథకాలతో తెలంగాణ స్వరూపమే మార్చేశారు కేసీఆర్. ఒకప్పుడు బీడును తలిపించిన నేలలు.. ఇప్పుడు పచ్చదనంతో మెరిసిపోతున్నాయంటే అది కేసీఆర్‌ ఘనతే. గోదారిలో ఏకంగా 110 కిలోమీటర్ల మేర నీళ్లు నిండుగా ఉన్నాయటే.. అది ఆయన సృష్టించిన కాళేశ్వరం చలువే.

400లకు పైగా సంక్షేమ కార్యక్రమాలు:
ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు నాన్‌స్టాప్‌గా కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు కేసీఆర్. పెన్షన్ల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్, కేసీఆర్ కిట్, కంటి వెలుగుతో పాటు రైతుబంధు లాంటి ప్రజాహిత కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలంగాణలో వేర్వేరు పథకాలతో లబ్ధి పొందని కుటుంబాలు లేవనే చెప్పాలి. ఇక హరితహారంతో తెలంగాణకు పచ్చని హారాన్ని వేసి దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా చేశారు. మొదటి దశలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగు వందలకు పైగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారంటే.. పేదప్రజల పట్ల ఆయనకున్న మమకారం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. స్పాట్..

హైదరాబాద్‌కు క్యూ కట్టిన అంతర్జాతీయ సంస్థలు:
పెట్టుబడులకు తెలంగాణను స్వర్గధామంగా మలిచారు కేసీఆర్‌. ఓవైపు సకల సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు రాయితీలు ఇచ్చారు. దీంతో అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు  హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. ఫలితంగా మన నగరం ప్రపంచంలోనే మోస్ట్‌ డైనమిక్‌ సిటిగా అవతరించింది. ఇక ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని గ్రహించిన కేసీఆర్‌ అదే కాన్ఫిడెంట్‌తో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వాజ్‌పేయ్, చంద్రబాబు ప్రభుత్వాలు గతంలో ముందస్తుకి వెళ్లి బొక్కబోర్లాపడ్డాయి. కానీ కేసీఆర్‌ మాత్రం వాటిని పట్టించుకోలేదు.  పైగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లిచ్చి, అంతా తానై ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. గులాబీ స్టామినాను రెపరెపలాడించారు.

ఎన్నికలు ఏవైనా గెలుపు కారుదే:
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తిరుగులేని విజయం సాధించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తన పట్ల ప్రజాదరణ చెక్కు చెదర్లేదని నిరూపించారు కేసీఆర్‌. అలాగే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కారు జోరే కొనసాగింది. అంతేందుకు నిన్నటి సహకార ఎన్నికల్లోనూ సారు పార్టీనే జోరు చూపించింది. ఎన్నికల్లో పక్కా వ్యూహాలతో ప్రతిపక్షాల అడ్రస్‌ చేయడంలోనే కాదూ.. తనదైన స్టయిల్‌లో పాలనాపరంగానూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కేసీఆర్ లాంటి పాలనాదక్షుడి చేతుల్లో ఉన్నంతవరకు తెలంగాణకు ఎదురులేదంటే అతిశయోక్తి లేదు.