వాట్ ఏ మూవీ : KGF అద్భుతం అంటున్నకేటీఆర్

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 07:07 AM IST
వాట్ ఏ మూవీ : KGF అద్భుతం అంటున్నకేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొలిటికల్‌గా బిజీగా ఉన్నా కుటుంబంతో, సన్నిహితులకు కొంత టైం కేటాయిస్తుంటుంటారు. సామాజిక మాధ్యమాల్లో కేటీఆర్ చురుకుగా పాల్గొంటారు. ప్రధానంగా ట్విట్టర్ వేదికగా ఆప‌ద‌లో ఉన్న‌వారి ప‌ట్ల ఎంత వేగంగా, ఉదారంగా స్పందిస్తారో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆయన ఓ సినిమా చూశారంట. ఆ సినిమా భేష్ అంటూ కేటీఆర్ కితాబిచ్చారు. స్వయంగా ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. 

‘కేజీఎఫ్’ సినిమాను కేటీఆర్ చూశారు. సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. కొంచెం లేట్ అయినా సినిమా చూసినట్లు, టెక్నికల్‌ బ్రిలియంట్ అంటూ ప్రశంసించారు. నీల్ దర్శకత్వం, యష్ నట అద్భుతం కొనియాడారు. ట్విట్టర్ ద్వారా ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం కేటీఆర్ వెల్లడించారు. 

టాలీవుడ్‌లో ‘కేజీఎఫ్’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. కన్నడలో ‘యశ్’ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ విడుదలైన అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులిపింది. ఈ సినిమా గత ఏడాడి డిసెంబర్ 21న విడుదలైంది. ఒక్క కన్నడంలోనే కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ అయి భారీ కలెక్షన్లను సాధించింది. సంచలనం సృష్టించిన ఈ సినిమా పార్ట్ 2కు రంగం సిద్ధమౌతోంది.