ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదన్న సీఎం కేసీఆర్ కి అభినందనలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు స్పందించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని అన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం

  • Published By: veegamteam ,Published On : October 14, 2019 / 06:17 AM IST
ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తి లేదన్న సీఎం కేసీఆర్ కి అభినందనలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు స్పందించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని అన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ సీనియర్ నేత కే కేశవరావు స్పందించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయని అన్నారు. ఆత్మహత్య ఏ సమస్యకు కూడా పరిష్కారం కాదన్నారు. ప్రాణత్యాగాలు చేయొద్దని ఆయన కోరారు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు సమ్మె ఆపి… ప్రభుత్వంతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. సమ్మె వల్ల ఇబ్బందలే తప్ప ఎలాంటి లాభం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తప్ప కార్మికుల మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేకే కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం గతంలో గొప్పగా పరిష్కరించిందని ఆయన గుర్తు చేశారు. 44 శాతం ఫిట్ మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే అని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రసక్తి లేదని చెప్పిన సీఎం కేసీఆర్ కు కేకే అభినందనలు తెలిపారు.
 
అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజ్ క్యారేజీల విషయంలో కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని కేకే కోరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా తాను ఉన్నానని గుర్తు చేసిన కేకే.. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రతిపాదనేది మేనిఫెస్టోలో చేర్చలేదని స్పష్టం చేశారు. ఆర్టీసీయే కాదు ఏ ప్రభుత్వరంగ సంస్థను కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో తెలపలేదన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. యూనియన్లకు సంబంధం లేని అంశం అన్నారు.

డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 5వ తేదీన ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగారు. 10 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.