కొత్త గవర్నర్ ఇంట్లో కత్తి కలకలం

హిమాచల్‌ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కనిపించడం కలకలం రేపింది. గవర్నర్‌గా నియమితులైన

  • Edited By: veegamteam , September 5, 2019 / 02:56 AM IST
కొత్త గవర్నర్ ఇంట్లో కత్తి కలకలం

హిమాచల్‌ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కనిపించడం కలకలం రేపింది. గవర్నర్‌గా నియమితులైన

హిమాచల్‌ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కనిపించడం కలకలం రేపింది. గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయను అభినందించేందుకు నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ రాంనగర్ లో ఆయన ఇంటికి క్యూ కట్టారు. బుధవారం(సెప్టెంబర్ 4,2019) ఫిజియోథెరపీ ముగించుకుని దత్తాత్రేయ హాల్‌లోకి వచ్చారు. ఆయనను కలిసేందుకు తోసుకుంటూ కొందరు ముందుకొచ్చారు. ఆ సమయంలో ఓ వ్యక్తి జేబు నుంచి కత్తి కిందపడింది. మాజీ డీజీపీ హెచ్‌జే దొర దత్తాత్రేయను కలవడానికి వచ్చిన సమయంలోనే ఇది జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

కత్తిని గమనించిన కార్యకర్తలు దాన్ని దత్తాత్రేయ వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ కత్తి స్టేషనరీలో పేపర్‌ కట్టింగ్, వైర్ల కట్టింగ్‌ చేయడానికి ఉపయోగించేదిగా పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.