కోడెల మృతి కేసు : ఆత్మహత్యకు పాల్పడ్డ వైర్ స్వాధీనం, లాస్ట్ కాల్ ఎవరిది

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు కారణాలు ఆరా తీస్తున్నారు. కోడెల ఎందుకు

  • Edited By: veegamteam , September 17, 2019 / 08:05 AM IST
కోడెల మృతి కేసు : ఆత్మహత్యకు పాల్పడ్డ వైర్ స్వాధీనం, లాస్ట్ కాల్ ఎవరిది
ad

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు కారణాలు ఆరా తీస్తున్నారు. కోడెల ఎందుకు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు కారణాలు ఆరా తీస్తున్నారు. కోడెల ఎందుకు సూసైడ్ చేసుకున్నారు అనేది తెలుసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ కేబుల్ వైర్ ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. కోడెల ఫోన్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.

సోమవారం(సెప్టెంబర్ 16,2019) ఉదయం 8:30 కి కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ కాల్ ఎవరికి చేశారు, ఏం మాట్లాడారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న స్పాట్ లో ఫింగర్ ప్రింట్స్ ను క్లూస్ టీం సేకరించింది. కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ ను పోలీసులు లిఖితపూర్వకంగా రికార్డ్ చేశారు. అన్ని కోణాల్లోనూ ఈ కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల మృతి రాజకీయ మలుపు తీసుకుంది. ఇది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. కేసులు పెట్టి వేధించి చంపేశారని అంటున్నారు. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. కాగా, చంద్రబాబు తీరు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. కోడెల కేసులో చంద్రబాబుని ఏ 1 ముద్దాయిగా చేర్చి విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజానిజాలు వెలికితీసి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.