ఆహాలో క్రాక్.. సీఐ శంకర్ ఇరగదీస్తున్నాడు

10TV Telugu News

Krack in AhA: సినిమా థియేటర్లతో పాటు ప్రముఖ తెలుగు ఓటీటీ అయిన ఆహాలోనూ రిలీజ్ అయింది. సినిమా థియేటర్లలో వచ్చిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ సంపాదించుకుంటున్న క్రాక్.. సూపర్ హిట్‌ టాక్ కొట్టేసింది. అలా రిలీజ్ అయిన 24గంటల్లోనే 2.2మిలియన్ మంది సినిమాను వీక్షించారు.

ఇటీవల విడుదలైన సినిమాలన్నింటి కంటే క్రాక్ సినిమా చూసేందుకే మొగ్గు చూపుతున్నారు వీక్షకులు. పోలీసాఫీసర్ రోల్‌లో కనిపించిన రవితేజ.. ఫుల్ టైం యాంగ్రీ పోలీస్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. కథను చక్కగా మలిచి అన్ని పాత్రలకు న్యాయం చేకూర్చిన మలినేని గోపిచంద్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆయనతో పాటుగా ట్విట్టర్‌లో రవితేజ, శ్రుతిహాసన్, మలినేని గోపీచంద్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, తమన్‌లు ట్వీట్ ల ద్వారా సంతోషాన్ని పంచుకుంటున్నారు.