కృష్ణా వాటర్‌ బోర్డు భేటీ : నీటి వినియోగంపై చర్చ

కృష్ణా వాటర్‌ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ హాజరుకానున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 03:10 AM IST
కృష్ణా వాటర్‌ బోర్డు భేటీ : నీటి వినియోగంపై చర్చ

కృష్ణా వాటర్‌ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ హాజరుకానున్నారు.

కృష్ణా వాటర్‌ బోర్డు సమావేశం ఇవాళ జరుగనుంది. వాస్తవానికి ఈ సమావేశం నిన్ననే జరగాల్సి ఉంది. సమావేశానికి హాజరయ్యేందుకు ఏపీ తరపున ఈఎన్సీ, ఇతర అధికారులు హైదరాబాద్‌ వచ్చారు. తెలంగాణ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కూడా హాజరయ్యేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఏపీ జల వనరులశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సమావేశానికి రావడానికి వీలుకాలేదు. 

దీంతో ఉన్నతాధికారులు ఫోన్‌లో సంప్రదించుకొని భేటీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కృష్ణా వాటర్‌ బోర్డు సమావేశం జరుగనుంది. దీనికి తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, ఏపీ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ హాజరుకానున్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీలో వరద సమయంలో నీటి వినియోగం పీటముడిగా మారింది. ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్న సమయంలో నీటి వినియోగాన్ని లెక్కించవద్దంటూ ఏపీ.. కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు ఏపీ జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ బోర్డు సభ్యకార్యదర్శికి లేఖ రాశారు. 

బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు పొంగిపొర్లాయని.. ఆ సమయంలో రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటిని లెక్కల్లోకి తీసుకోవద్దని లేఖలో కోరారు. అయితే, వరదల సమయంలో ఏపీ వాడుకున్న నీటి పరిమాణం భారీగా ఉండడంతో…. నేటి బోర్డు సమావేశంలో దీనిపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశమున్నది.