పుల్వామా ఘటనపై మేము స్పందించినంతగా మోడీ స్పందించలేదు : కేటీఆర్

పుల్వామా ఘటనపై మేము స్పందించినంతగా మోడీ స్పందించలేదు : కేటీఆర్

పుల్వామా ఘటనపై కేసీఆర్ స్పందించిన విధంగా దేశంలో ప్రధాని మోడీతో సహా మరెవ్వరైనా స్పందించారో చూపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

పుల్వామా ఘటనపై మేము స్పందించినంతగా మోడీ స్పందించలేదు : కేటీఆర్

పుల్వామా ఘటనపై కేసీఆర్ స్పందించిన విధంగా దేశంలో ప్రధాని మోడీతో సహా మరెవ్వరైనా స్పందించారో చూపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ : పుల్వామా ఘటనపై కేసీఆర్ స్పందించిన విధంగా దేశంలో ప్రధాని మోడీతో సహా ఎవరైనా స్పందించారో చూపాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వారం రోజులపాటు తమ రాజకీయ కార్యక్రమాలను వాయిదా వేసుకుని, సంతాపం తెలిపినట్టు ఆయన చెప్పారు. కేంద్రంపై తాము ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు. ఈ మేరకు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పుల్వామా ఘటనపై ఎలాంటి నటన, హైప్ క్రియేట్ చేయకుండా భావోద్వేకంగా మాట్లాడని ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
Read Also :కేసీఆర్..దమ్ముందా : మేం పాండవులం గెలుపు కాంగ్రెస్ దే

దేశ సైనికుల తరపున నిలిచామని మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించామని తెలిపారు. కేసీఆర్ చేసిన విధంగా దేశంలో ఒక్క సీఎం అయినా చేశాడో చూపించాలన్నారు. కాంగ్రెస్, బిజెపిలు కాశ్మీర్ సమస్యకు కారణమని ఆరోపించారు. ఈ సమస్య ఒక అంతర్జాతీయ వివాదానికి దారితీసిందన్నారు. మరోవైపు మోడీ ప్రభుత్వం సందేహాలు సృష్టించిందని తెలిపారు. 

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రధాన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అంగీకరించారని చెప్పారు. టీఆర్ఎస్ 50 శాతం ఓట్లను పొందిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందన్నారు. తెలంగాణ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజనగా పేరు మార్చి కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఢిల్లీలోని ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వ ఆలోచనను అంగీకరిస్తుందనడానికి ఇది నిదర్శనం అన్నారు.

కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజనకు తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశ్రీ ట్రస్టు సహాయ సహకారాలు అందించిందని తెలిపారు. కేసీఆర్ దేశాన్ని ప్రేరేపించగలగడం వాస్తవమన్నారు. దాదాపు 12 రాష్ట్రాలు మిషన్ భగీరథపై అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. యుఎన్ డీపీ.. మిషన్ కాకతీయను మెచ్చుకున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంపై అధిక ప్రభావం చూపాయన్నారు.

×