పొత్తు లేకుండా బతకలేరు: చంద్రబాబుపై కేటీఆర్‌ ఫైర్

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అని మండిపడ్డారు. ఎవరో ఒకరితో

  • Published By: veegamteam ,Published On : February 25, 2019 / 04:36 PM IST
పొత్తు లేకుండా బతకలేరు: చంద్రబాబుపై కేటీఆర్‌ ఫైర్

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అని మండిపడ్డారు. ఎవరో ఒకరితో

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు పేటెంట్ అని మండిపడ్డారు. ఎవరో ఒకరితో పొత్తులు లేకుండా చంద్రబాబు బతకలేరని అన్నారు. ఏపీలోని దుర్మార్గ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్‌ చెప్పారు. బాబు పోతేనే జాబులు వస్తాయని ఏపీ ప్రజలు అంటున్నారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ పథకాలన్నింటినీ చంద్రబాబు కాపీ కొడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలు వచ్చేసరికి ఆయనకు రైతులు గుర్తుకొచ్చారని మండిపడ్డారు. సోమవారం (ఫిబ్రవరి 25) సాయంత్రం టీఆర్‌ఎస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాలమూరు జిల్లాకు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

చంద్రబాబుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మనల్ని తిడుతూనే టీఆర్‌ఎస్ పథకాలను బాబు కాపీ కొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతుల కోసం కేసీఆర్ రెండేళ్ల కిందట రైతు బంధు పథకం ప్రారంభించారని, చంద్రబాబు దాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో కాపీ కొట్టారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఇక్కడ కళ్యాణ లక్ష్మి అమలు చేస్తే.. ఆయన పసుపు కుంకుమ అంటున్నారు… మన అన్నపూర్ణ క్యాంటీన్ల పథకంలో పూర్ణ తీసేసి అన్న క్యాంటీన్లు పేరుతో ఏపీలో అమలు చేస్తున్నారు అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు స్కీమ్ ని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో మోడీ కాపీ కొడితే.. అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు కాపీ కొట్టారని మండిపడ్డారు.

కేసీఆర్‌కు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని.. జగన్‌ను సామంత రాజుగా చేసుకొని పాలించాలని చూస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. కేసీఆర్ చక్రవర్తో, కాదో తెలంగాణ ప్రజలు మొన్ననే చెప్పారు. ఒకవేళ కేసీఆర్ చక్రవర్తే అయితే.. ఆయన చెట్లు నాటించిన అశోక చక్రవర్తి. చంద్రబాబు మాత్రం రోమ్ నగరం తగలబడి పోతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి లాంటి వారు. కేసీఆర్‌కు చంద్రబాబుకు నక్కకు నాగ లోగానికి ఉన్నంత తేడా ఉంది’ అని కేటీఆర్ అన్నారు.