వెల్‌కమ్ సార్ : కేటీఆర్‌కు హార్వర్డ్ ఆహ్వానం

  • Edited By: veegamteam , January 6, 2019 / 03:37 PM IST
వెల్‌కమ్ సార్ : కేటీఆర్‌కు హార్వర్డ్ ఆహ్వానం

హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హార్వర్డ్ ఇండియా వార్షిక కాన్ఫరెన్స్‌కి హాజరుకావాల్సిందిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. 2019 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో జరగనున్న ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. సుమారు వెయ్యి మంది విద్యావేత్తలు, విద్యార్థులు, యువ వృత్తి నిపుణులు హాజరుకానున్న ఈ సమావేశానికి కేటీఆర్‌కి ఆహ్వానం లభించింది. ఇండియా ఎట్ ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్‌ అనే థీమ్‌ ఆధారంగా సాగనున్న ఈ సమావేశంలో ప్రత్యేక వక్తగా  ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను యూనివర్సిటీ వార్షిక సదస్సు నిర్వాహకులు కోరారు.