ఓటు వేయనివారిపై కేటీఆర్ కామెంట్

ప్రధానమైన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 02:49 PM IST
ఓటు వేయనివారిపై కేటీఆర్ కామెంట్

ప్రధానమైన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

ప్రధానమైన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించడం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగం నిర్వహణ పట్ల గర్వంగా ఉందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని లోక్ సభ నియోజకవర్గాల్లో ఈసారి భారీగా ఓటింగ్ పెరిగిందని చెప్పారు. కానీ, సిటీలు, టౌన్లలో మాత్రం ఓటింగ్ తక్కువగా నమోదు కావడం బాధగా అనిపించందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల పోలింగ్ లో తనవంతు బాధ్యతగా ఓటు వేసినట్టు చెప్పారు. నా వేలికి సిరా ఉంది.. మరి మీరు ఓటు వేశారా? ఓటు వేసి మీ వేలికి సిరాను చూపించండి అంటూ ట్వీట్ చేశారు. 

ఓటు వేయనివారిని ఉద్దేశించి కేటీఆర్ ఓ స్వీట్ సజేషన్ ఇచ్చారు. ‘గయ్స్..  ఎన్నికల్లో ఎవరైతే ఓటువేయలేదో.. ఒక విషయం గుర్తుంచుకోండి. మనకు మెజార్టీ వల్ల ఏర్పడిన ప్రభుత్వం లేదు. ఓటింగ్ లో ఎవరైతే ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారో వారి ఓట్లతోనే ప్రభుత్వం ఏర్పడింది’ అని   కేటీఆర్ ట్వీట్ చేశారు.