Telangana assembly: ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక పార్ల‌మెంట్‌.. అందుకే దానికి అంబేద్కర్ పేరు పెట్టాలి: తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. కొత్త పార్లమెంటు భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక పార్ల‌మెంట్‌ అని చెప్పారు. అందుకే దానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని అన్నారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింద‌ని, తాము ఆయన చూపిన బాట‌లోనే న‌డుస్తున్నామ‌ని చెప్పారు.

Telangana assembly: ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక పార్ల‌మెంట్‌.. అందుకే దానికి అంబేద్కర్ పేరు పెట్టాలి: తీర్మానం ప్రవేశపెట్టిన కేటీఆర్

Telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభ, శాసన మండలిలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. కొత్త పార్లమెంటు భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ తెలంగాణ మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక పార్ల‌మెంట్‌ అని చెప్పారు. అందుకే దానికి అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని అన్నారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింద‌ని, తాము ఆయన చూపిన బాట‌లోనే న‌డుస్తున్నామ‌ని చెప్పారు.

అంబేద్క‌ర్ త‌త్వాన్ని తమ ప్రభుత్వం తెలంగాణలో ఆచ‌ర‌ణ‌లో చూపింద‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దేశానికి దార్శనికతను చూపిన వ్యక్తి అంబేద్కర్ అని ఆయన చెప్పారు. దేశంలో సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం సాధించాల్సి ఉందని అన్నారు. రాసిన రాజ్యాంగం దుర్వినియోగమై, దాన్ని తానే త‌గుల‌బెడుతాన‌ని అంబేద్కరే అన్నార‌ని కేటీఆర్ అన్నారు.

దేశంలో భాషా ఆధిప‌త్యంతో పాటు ప్రాంతీయ ఆధిప‌త్యాన్ని అంబేద్క‌ర్‌ వ్య‌తిరేకించారని కేటీఆర్ చెప్పారు. కాగా, కేటీఆఱ్ ప్ర‌వేశ పెట్టిన‌ తీర్మానాన్ని ఏక‌గ్రీవంగా ఆమోదం తెలప‌డానికి కాంగ్రెస్ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు భట్టి విక్రమార్క చెప్పారు. అలాగే, హైదరాబాద్ లోని పంజాగుట్ట‌లోనూ అంబేద్క‌ర్ భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు… కొత్తగా 4,369 నమోదు