ఒంటేరు మంచి నిర్ణయం తీసుకున్నారు : కేటీఆర్

పదేండ్ల సమయం పట్టినా.. ఒంటేరు ప్రతాప్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 02:33 PM IST
ఒంటేరు మంచి నిర్ణయం తీసుకున్నారు : కేటీఆర్

పదేండ్ల సమయం పట్టినా.. ఒంటేరు ప్రతాప్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ అన్నారు.

హైదరాబాద్ కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ ఒంటేరుపై గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కలిసి పనిచేద్దామని గతంలో కూడా ఒంటేరును కోరామని గుర్తు చేశారు. పదేండ్ల సమయం పట్టినా.. ఒంటేరు మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గజ్వేల్ లో నిధుల వరద పారుతోందన్నారు. కేసీఆర్ స్వప్నం కోటి ఎకరాల మాగాణి త్వరలో సాకారం అవుతుందని చెప్పారు. గజ్వేల్ లో ఇకపై ఏ ఎన్నిక వచ్చినా ఏకపక్షమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో అభివృద్ధి వేగం పెరగాలని ఆకాంక్షించారు. 16 ఎంపీ స్థానాలు గెలుచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవాలన్నారు.

బీజేపీ నేతల చెంపలు చెల్లుమనేలా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. మోడీ వట్టి బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. యూపీలో కూడా ఓట్లు చీలకుండా ఎస్పీ, బీఎస్పీ కలిపిపోయాయని.. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు ఉండదని ఆ రెండు పార్టీలు చెబుతున్నాయని తెలిపారు. జగన్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఉండే రోజు దూరంలో లేదన్నారు.

నాలుగున్నరేళ్ల తర్వాత కేంద్రం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారని.. 36 ఏళ్ల ప్రత్యర్థి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. మోడీని బూచిగా చూపుతూ బాబు అసమర్థతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రజల అభివృద్ధికి టీఆర్ఎస్ ఏనాడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రాంతాలకతీతంగా కేసీఆర్ సుపరిపాలన అందించారని పేర్కొన్నారు.