రంగంలోకి కేటీఆర్ : మున్సిపల్ ఎన్నికల్లో ముందస్తు వ్యూహం

మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కేటీఆర్‌. పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్‌గా నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 01:43 AM IST
రంగంలోకి కేటీఆర్ : మున్సిపల్ ఎన్నికల్లో ముందస్తు వ్యూహం

మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కేటీఆర్‌. పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్‌గా నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే

మున్సిపల్ ఎన్నికలకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కేటీఆర్‌. పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్‌గా నేతలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే మున్సిపాల్టీలపై సమీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. నాలుగైదు రోజుల పాటు వరుసగా పార్టీ నేతలకు అందుబాటులో ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలిచే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు కేటీఆర్‌. మున్సిపల్‌ ఎన్నికల్లో వర్గపోరు లేకుండా ముందుగానే వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. అలకలు, అసంతృప్తులు బయటపడకుండా పక్కా వ్యూహంతో వెళ్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఆశావహులు, అసంతృప్తుల సంఖ్య ఎక్కువగా కనిపించేలా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. ఒక్కో వార్డులో ముగ్గురు నుంచి నలుగురు తాము బరిలో దిగుతామంటూ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీంతో స్వయంగా కేటీఆరే రంగంలోకి దిగుతున్నారు. పార్టీలో పరిస్థితులు చక్కదిద్దేందుకు నేతలకు అందుబాటులో ఉండాలనుకుంటున్నారు కేటీఆర్. 

తెలంగాణ భవన్ లేదా నంది నగర్‌లోని స్వగృహంలో వచ్చిన వారిని కలిసి మాట్లాడుతున్నారు కేటీఆర్. ఎన్నికల వ్యూహాలపైనా జిల్లాల వారీగా మంత్రులు, ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు. మంత్రులు, ముఖ్యనేతలకు బాధ్యతలను అప్పగిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు గెలిచిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో ప్రత్యేకంగా నేతలకు బాధ్యతలను అప్పగిస్తున్నారు కేటీఆర్‌.

గత అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలించి.. క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. 

* పార్టీ నేతలకు అందుబాటులో కేటీఆర్
* మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షలు
* అసంతృప్త నేతలపై ఇప్పటి నుంచే ఫోకస్
* సమష్టిగా ఎన్నికలు ఎదుర్కోవాలని సూచనలు
* అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి వ్యూహాలపై దృష్టి
* వర్గపోరు లేకుండా ముందస్తు వ్యూహం
* అలకలు, అసంతృప్తులు బయటపడకుండా వ్యూహరచన
* నియోజకవర్గాల్లో ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు 
* ఒక్కో వార్డులో పోటీకి ముగ్గురు నుంచి నలుగురు 
* స్వయంగా రంగంలోకి దిగుతున్న కేటీఆర్
* జిల్లాల వారీగా మంత్రులు, ముఖ్యనేతలతో చర్చలు
* మంత్రులు, ముఖ్యనేతలకు బాధ్యతలు
* బీజేపీ ఎంపీలు గెలిచిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి 

Also Read : పవన్ స్టాండ్ ఏంటీ ? : మూడు రాజధానులకు అనుకూలమా ? వ్యతిరేకమా ?