#AskKTR : ఇంటర్ పరిణామాలు దురదృష్టకరం – కేటీఆర్

  • Published By: madhu ,Published On : April 29, 2019 / 03:16 AM IST
#AskKTR : ఇంటర్ పరిణామాలు దురదృష్టకరం – కేటీఆర్

ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాల వ్యవహారంలో జరిగిన పరిణామాలు దురదృ‌ష్టకరమని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధను ఒక తండ్రిగా అర్థం చేసుకోగలనని, వీటిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. ఏప్రిల్ 28వ తేదీ ఆదివారం ట్విట్టర్‌లో #Askktr పేరిట నెటిజన్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ అంశాలతో పాటు ఇంటర్‌ ఫలితాలపై కూడా నెటిజన్లు పలు ప్రశ్నలు సంధించారు. 

ఇంటర్ వివాదంలో మోసం ఉందని అనిపిస్తోంది..కావాలని చేసినట్లున్నారు అని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సమస్యను మరింత వివాదాస్పదం చేయవద్దని కేటీఆర్ సమాధానం ఇచ్చారు. పిల్లల విషయంలో మాత్రం సమాధానం దాట వేస్తున్నారు..ఇంటర్ విషయంలో కొంచెం క్లారిటీ ఇవ్వడం..నమ్మకాన్ని పొగొట్టుకోకండి అని మరో నెటిజన్ ప్రశ్నించారు. ఏం క్లారిటీ ఇవ్వాలో మీరే చెప్పండి సార్.. జరిగిన ఘటనలతో బాధ పడుతున్నా..ఇందుకు కారకులైన వారిని శిక్షించాలి..నేను ఓ తండ్రినే..పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల బాధను నేనూ అర్థం చేసుకోగలను అని కేటీఆర్ సమాధానం ఇచ్చారు.