ఇండస్ట్రీల స్థాపనకు వెల్‌కమ్ చెప్తోన్న కేటీఆర్

ఇండస్ట్రీల స్థాపనకు వెల్‌కమ్ చెప్తోన్న కేటీఆర్

KTR: ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హైదరాబాద్‌కు సమీపంలో మెడికల్ సిటీని నిర్మిస్తున్నామని ఇప్పటికే పలు దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. జీవశాస్త్రాల రంగంలో ముందున్న లిథుయేనియా సైతం ఔషధ నగరి డెవలపింగ్ పార్టనర్ కావాలని కోరారు. లిథుయేనియా రాయబారి జూలియస్‌ ప్రానెవిసియస్‌, ఇతర రిప్రజంటేటివ్స్ టీం మంగళవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో భేటీ అయింది. పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

జూలియస్‌ మాట్లాడుతూ.. జీవశాస్త్రాల రంగంలో తాము ముందున్నామని, తమ జీడీపీలో 5 శాతం ఈ రంగానిదేనని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులకు తమ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వెల్లడించారు.

హై స్టాండర్డ్స్‌ మౌలిక సదుపాయాలతో 19 వేల ఎకరాల్లో ఔషధనగరిని నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఇప్పటికే భారతదేశానికి తెలంగాణ టీకాల రాజధానిగా ఉందని, ప్రపంచంలోని 33 శాతం టీకాలు ఇక్కడే తయారవుతున్నాయన్నట్లు వివరించారు. కరోనా టీకాను హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసిందన్నారు. ఔషధనగరి డిజైన్‌ను మంత్రి వారికి అందజేశారు.

కరోనా మహమ్మారిపై పోరు, ఆరోగ్య, ఔషధ, వైద్య సాంకేతిక రంగాల డెవలప్‌మెంట్ టార్గెట్‌గా ఫిబ్రవరి 22, 23 తేదీల్లో దృశ్యమాధ్యమంలో బయోఆసియా-2021 అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తెలిపారు. ఈ మీటింగ్ ద్వారా తెలంగాణతో పాటు దేశానికి కొత్త అవకాశాలు లభిస్తాయని, సంక్షోభాలు, సమస్యలు, సవాళ్లకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.

‘ప్రపంచంలో బెస్ట్ స్టాండర్స్డ్ జీవశాస్త్రాల కేంద్రంగా తెలంగాణ డెవలప్ అయింది. ఇందులో బయోఆసియాది ఇంపార్టెంట్ రోల్. రెండ్రోజుల మీటింగ్‌లో అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ప్రధానంగా కరోనా అనంతర పరిణామాలు, మున్ముందు ఇలాంటి వైరస్‌లు రాకుండా నిరోధించేందుకు చేపట్టాల్సిన చర్యలు, ప్రపంచవ్యాప్తంగా జీవశాస్త్రాల పరిశ్రమలో పరిణామాలు, ఆరోగ్య పరిరక్షణ, ఆవిష్కరణలు, ఎగుమతులు, దిగుమతులపైనా చర్చలుంటాయి’ అని చెప్పారు.