తండ్రికి తగ్గ తనయుడు : పర్యావరణం విభాగంలో హిమాన్షుకు అవార్డు

  • Published By: madhu ,Published On : March 1, 2019 / 03:02 AM IST
తండ్రికి తగ్గ తనయుడు : పర్యావరణం విభాగంలో హిమాన్షుకు అవార్డు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడుకు ‘హిమాన్షు’ తెలంగాణలో తెలియని వారుండరు. మనువడు అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ప్రేమ. ఇతను వార్తల్లోకి ఎక్కాడు. డీహెచ్‌ఎఫ్‌ఎల్, ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన ‘బెహతర్ ఇండియా క్యాంపెయిన్, పర్యావరణ విభాగం’లో హిమాన్షు బంగారు పతకం సాధించాడు. హైదరాబాద్ ఓ క్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో హిమాన్షు చదువుతున్నాడు. బెహతర్ ఇండియా క్యాంపెయిన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఫిబ్రవరి 28వ తేదీ గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమం జరిగింది. క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్ సినీ నటీ పరిణితి చోప్రా ముఖ్యఅతిథిగా హాజరై పతకాలను అందించారు. 

వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల వ్యర్థాలను సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు హిమాన్షు. పాఠశాల విభాగంలోనూ ఓ క్రిడ్జ్ స్కూల్ 34,137 కిలోల వ్యర్థాలను సేకరించి మూడో స్థానంలో నిలిచింది. హిమాన్షును డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ అనూప్ అభినందించారు. జాతీయ స్థాయిలో ఓక్రిడ్జ్ పాఠశాలకు బెహతర్ ఇండియా కార్యక్రమంలో 2 పతకాలు రావడం ఆనందంగా ఉందని పాఠశాల ప్రిన్స్‌పాల్ అర్జున్ రావు వెల్లడించారు.