పంచాయతీ కార్మికులకు జీవిత బీమా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవితబీమా సౌకర్యం కల్పించింది.

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 03:15 PM IST
పంచాయతీ కార్మికులకు జీవిత బీమా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవితబీమా సౌకర్యం కల్పించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవిత బీమా సౌకర్యం కల్పించింది. దేశ తొలి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సురేంద్ర కుమార్ డేకు నివాళిగా పంచాయతీ కార్మికుల జీవితాబీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. శుక్రవారం (జనవరి 3, 2020) ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి రూ.968 ప్రీమియంతో రూ.2లక్షల జీవితబీమా సదుపాయం, ఎల్ఐసీ ద్వారా 18-59 ఏళ్ల మధ్య వయసు కలిగిన పంచాయతీ కార్మికులకు ఈ జీవిత బీమా పథకం అమలు కానుంది. 

గతంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జీవిత బీమా సౌకర్యం కల్పించింది. సీఎం కేసీఆర్ రైతులందరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించారు. వ్యవసాయాభివృద్ధి- రైతుల సంక్షేమం కోసం ఎకరానికి 8వేల రూపాయల పెట్టుబడి, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతులకు జీవిత బీమా లాంటి అనేక పథకాలు ప్రవేశ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. పంచాయతీ కార్మికులకు జీవిత బీమా సౌకర్యం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

జీవితబీమా సౌకర్యం ప్రకటించడంతో పంచాయతీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలాగే కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నారు.