కిలో మటన్ @ రూ.1200, హైదరాబాద్ లో మంట పుట్టిస్తున్న మటన్ ధరలు

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ మటన్ ధరలపై పడింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మటన్ కు డిమాండ్ పెరిగింది. మటన్ కొనేవారి సంఖ్య పెరిగింది. దీంతో మటన్

  • Published By: veegamteam ,Published On : March 31, 2020 / 09:07 AM IST
కిలో మటన్ @ రూ.1200, హైదరాబాద్ లో మంట పుట్టిస్తున్న మటన్ ధరలు

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ మటన్ ధరలపై పడింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మటన్ కు డిమాండ్ పెరిగింది. మటన్ కొనేవారి సంఖ్య పెరిగింది. దీంతో మటన్

కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ మటన్ ధరలపై పడింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా మటన్ కు డిమాండ్ పెరిగింది. మటన్ కొనేవారి సంఖ్య పెరిగింది. దీంతో మటన్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది. మార్కెట్ లో మటన్ ధరలు మంట పుట్టిస్తున్నాయి. కిలో మటన్ ధర రూ.1200కి పెరగడం విశేషం. గత వారం కిలో మటన్ ధర రూ.900గా ఉండేది. ఈ వారం రూ.1200కి చేరింది. అంటే వారం రోజుల వ్యవధిలో కిలో పై రూ.300 పెరగడం గమనార్హం. మటన్ ప్రియులకు ఈ ధరలు పిచ్చెక్కిస్తున్నాయి. 

మటన్ ధరలు మండిపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా పశువుల కొరత ఏర్పడిందని వ్యాపారులు తెలిపారు. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ లేదన్నారు. ఈ కారణంగా మటన్ రేటు అమాంతం పెరిగిందని వివరించారు.    ‘ఓవైపు కరోనా వైరస్ భయం, మరోవైపు లాక్ డౌన్, ఈ భయాలతో డ్రైవర్లు విధులకు రావడం లేదు. మరోవైపు పశువుల సరఫరా ఆగిపోయింది. ప్రధాన మార్కెట్ లో పశువులు అమ్మే ఏజెంట్లు, రైతులు విపరీతంగా ధరలు పెంచేశారు. మరో దారి లేకపోవడంతో మేము కూడా మటన్ ధరలు పెంచాల్సి వచ్చింది” అని లాల్ దర్వాజలోని ఓ మటన్ షాపు ఓనర్ చెప్పాడు.

”సాధారణంగా ట్రక్కుల్లో తెలంగాణలోని జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఏపీ నుంచి పశువుల సరఫరా జరిగేది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో డ్రైవర్లు నిత్యసవర వస్తువులు కూరగాయలు, పండ్లు, సరుకులు వంటివి తమ వాహనాల్లో రవాణ చేస్తున్నారు. పశువులు తీసుకురాడం ఆపేశారు. మటన్ ధరలు పెరగడానికి ఇదో కారణం. అదే సమయంలో పశువులు తీసుకొచ్చిన వారు తిరిగి ఖాళీ వాహనాలతో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో వారు ట్రాన్స్ పోర్టు చార్జీలు విపరీతంగా పెంచేశారు. మటన్ ధరలు పెరగడానికి అది కూడా ఓ కారణం” అని మరో మటన్ వ్యాపారి వివరించాడు.

పశువులు వ్యాపారులు అన్ని ఖర్చులు లెక్క వేస్తున్నారు. పశువుల ధరలను బాగా పెంచారు. దీంతో సాధారణ రోజుల్లో కన్నా ప్రస్తుతం ఎక్కువ మొత్తం పెట్టి పశువులు కొంటున్నాం. అందుకే మటన్ ధరలు పెరిగాయని మరో వ్యాపారి చెప్పాడు.

”మటన్ ధర కిలోపై ఏకంగా రూ.200 నుంచి రూ.300 ఒకేసారి పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. నేను రెగులర్ గా మటన్ కొంటాను. కిలో రూ.800. బోన్ లెస్ అయితే కిలో రూ.900. ఈసారి మాత్రం కిలో మటన్ ధర రూ.1200 చెబుతున్నారు. దీంతో నేను విస్తుపోయాను” అని ఓ కస్టమర్ వాపోయాడు.

ఓవైపు కరోనా వైరస్ ఎఫెక్ట్, మరోవైపు లాక్ డౌన్ ప్రభావం, ఇంకోవైపు పశువుల సరఫరా తగ్గిపోవడం… ఇవన్నీ మటన్ ధరలు అమాంతం పెరగడానికి కారణాలు. మరో బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే, చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో చికెన్ తినే వాళ్లు సంఖ్య భారీగా తగ్గిపోయింది. చికెన్ ప్రియులు కాస్తా మటన్ వైపు మొగ్గారు. దీంతో మటన్ కు భారీగా డిమాండ్ పెరిగింది. మటన్ ధరలు పెరగడానికి అదీ ఓ కారణమే అంటున్నారు వ్యాపారులు.