Publish Date - 2:18 am, Tue, 27 August 19
By
vamsiగ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థకి కొత్త కమిషనర్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న దాన కిషోర్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో రంగారెడ్డి కలెక్టర్ లోకేశ్ కుమార్‌ను నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం (ఆగస్ట్ 26వ తేదీ) విడుదల చేసింది. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా ఉన్న హరీశ్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు, జలమండలి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న దాన కిషోర్.. ఇకపై జలమండలి ఎండీగా మాత్రమే కొనసాగబోతున్నారు. దాన కిషోర్ ఏడాది కాలంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా పనిచేశారు. గతేడాది జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డిని బదిలీ చేసి దాన కిషోర్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇప్పుడు రెండు శాఖలలో ఒక్క శాఖను మాత్రమే ఆయనకు అప్పజెప్పారు.
Telangana BJP : కేటీఆర్ ను ఎందుకు కలిశారో..తేల్చండి…త్రిసభ్య కమిటీ వేసిన బీజేపీ
Udyoga Deeksha : షర్మిల ఉద్యోగ దీక్షలో పాల్గొన్న 10 మందికి కరోనా
Corona Vaccination : తెలంగాణలో రేపటి నుంచి వ్యాక్సినేషన్
మద్యం రెండు నిమిషాలు ఆలస్యంగా తెచ్చాడని సేల్స్ మెన్ పై దాడి
Hyderabad : పిల్లలకు వాహనాలు ఇస్తున్నారా ? బీ కేర్ ఫుల్ పేరెంట్స్
పెళ్లిని చెడగొట్టాలని.. లవర్‌కు కాబోయే భర్తను కిడ్నాప్ చేశాడు