లోక్‌సభ ఎన్నికలు 2019 : తెలంగాణలో నామినేషన్ల సందడి షురూ

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలున్నాయి.

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 12:44 PM IST
లోక్‌సభ ఎన్నికలు 2019 : తెలంగాణలో నామినేషన్ల సందడి షురూ

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. రాష్ట్రంలో 17 నియోజకవర్గాలున్నాయి. టీఆర్ఎస్ 16 స్థానాల్లో పోటీ చేయనుండగా మిత్రపక్షమైన ఎంఐంఎం ఒక స్థానంలో బరిలో దిగనుంది. మార్చి 18వ తేదీ సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పలువురు నేతలు నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. 

కరీంనగర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ నేత వినోద్ నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఎంఐఎం అధినేత ఓవైసీ, ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా రాథోడు రమేశ్ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. బీఎస్పీ, బీజేపీ పార్టీల నేతలు ఒక్కొక్కరు, ఇండిపెండెంట్‌గా ఒక్కరు నామినేషన్లు వేశారు. మొత్తంగా 6 నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల దాఖలుకు ఈ నెల 25 వరకు చివరి గడువు. మధ్యలో 21న హోలీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం కావడంతో ఆ రోజుల్లో నామినేషన్లను అధికారులు స్వీకరించరు. అంటే 4 రోజులు మాత్రమే నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. 
Read Also : సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు