OMG : తాగి వాహనం నడిపితే ఉద్యోగం గోవిందా

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 03:50 AM IST
OMG : తాగి వాహనం నడిపితే ఉద్యోగం గోవిందా

హైదరాబాద్ : మద్యం బాబులకు ఓ హెచ్చరిక. తాగి వాహనం తీసుకుని రోడ్డెక్కితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇప్పటికే పలు శిక్షలున్నాయి..కదా…అంటారా…డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరకడం..ఫైన్‌లు కట్టడం..లేకపోతే తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేయడం..రెండు..మూడు రోజులో జైలు శిక్ష వేయడంలాంటివి చేసే వారు పోలీసులు. ఇక మీద అలాంటివి నడవవ్. 
పెగ్గు మీద పెగ్గు వేస్తే..అంతే…
వీకెండ్‌లో స్నేహితులతో కలిసి పార్టీలు..ఇతరత్రా ఫంక్షన్‌లలో పెగ్గుల మీద పెగ్గులు వేసి వాహనాలతో రోడ్డెక్కితే కుదరద్ అంటున్నారు కాప్స్. ఇంట్లోనే ఉంటే సేఫ్ అంటున్నారు. ఏం కాదు..అంటే మాత్రం జీవితం మొత్తం బాధ అనుభవించే శిక్ష రెడీ అంటున్నారు. జీవితాన్ని చీకటిమయం చేయడం ఖాయం. మీపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలను కూడా ప్రశ్నార్థకం చేసే పరిస్థితి ఉత్పన్నమయ్యే ఛాన్స్ ఉంది. 
జాబ్ ఫసక్…
రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇటీవల పలు మార్గదర్శకాలు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకొనే దానికి సిద్ధం అవుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక వారు చేస్తున్న ఉద్యోగానికి బ్రేకులు పడినట్టే. ఇందులో ఎవరైనా సరే..అంటే ప్రభుత్వ ఉద్యోగి నుండి సాప్ట్ వేర్ ఉద్యోగి..చిన్న చితకా ఉద్యోగుస్థులైనా సరే…ఎవరు తాగి డ్రైవ్ చేశారో వారి జాబ్ ఫసక్. తాగి దొరికిన ఉద్యోగస్థుల వివరాలను వారు పనిచేస్తున్న ఉన్నతాధికారులకు తెలియచేయడం…ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని పోలీసులు సూచిస్తారంట. 
సో…పెగ్గు వేసి వాహనం తీసే ముందు ఆలోచించండి..అసలు మద్యపానం హానికరం. మీ జీవితమే కాకుండా ఇతర జీవితాలను ప్రశ్నార్థకం చేసుకోకండి…మద్యం ప్రియులారా…తస్మాత్ జాగ్రత్త….