ప్రైవేటు రూట్లలో ఆర్టీసీ : పర్మిట్ వల్ల నష్టమే – కుమార స్వామి

  • Published By: madhu ,Published On : November 6, 2019 / 07:14 AM IST
ప్రైవేటు రూట్లలో ఆర్టీసీ : పర్మిట్ వల్ల నష్టమే – కుమార స్వామి

ప్రైవేటు రూట్లలో ఆర్టీసీ బస్సులను తిప్పేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కానీ పర్మిట్ ఇచ్చి..బండ్లను తిప్పమని చెబితే..ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని కుమార స్వామి (అద్దె బస్సుల అసోసియేషన్ నేత) వెల్లడించారు. లాస్ వచ్చే పరిస్థితి కనిపిస్తోందన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై తీవ్ర ఆగ్రహంగా ఉంది ప్రభుత్వం. మొత్తం రూట్లను ప్రైవేటు వారికి అప్పగించేందుకు రంగం సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా కుమార స్వామితో 10tv మాట్లాడింది. 

అద్దె బస్ స్కీం ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే టెండర్లను పిలిచిందని, పాత స్కీం ప్రకారమే ప్రభుత్వ టెండర్లలో విధి విధానాలున్నాయని తెలిపారు. ఆర్టీసీలో 10 సంవత్సరాల నుంచి బస్సులు నడుపుతున్నామని..ప్రస్తుతం పర్మిట్  చేస్తే..తాము అదనంగా ఇద్దరు కండక్టర్లను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇలా చేయడం వల్ల లాస్ వచ్చే పరిస్థితి ఉందన్నారు. బస్సు నడుపకపోతే..క్యాన్సిల్ చేసే అధికారం యాజమాన్యానికి ఉందని, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే..తాము నష్టపోయే అవకాశం ఉందన్నారు.

ఈ క్రమంలో వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిన ఆగత్యం ఏర్పడిందన్నారు.  కొన్ని కొన్ని రూట్లలో డీజిల్‌కు వెచ్చించే డబ్బు కూడా రాదని..టోటల్ లాస్‌లో ఉంటాయన్నారు. ప్రభుత్వం పిలిచిన టెండర్‌ ప్రక్రియలో 4500 మంది పాల్గొన్నామన్నారు. మొత్తం 173 బస్సులకు టెండర్లు ఖరారయ్యాయని..ఇప్పటికే రూట్లకు అధికారులు పర్మిట్లు మంజూరు చేసి అలాట్ మెంట్ లెటర్లు ఇచ్చారన్నారు కుమారస్వామి. 
Read More : ఆగని నిరసనలు : ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికుల ఆందోళనలు