కిక్కు లక్కు : మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

కిక్కు లక్కు : మద్యం షాపుల లక్కీ డ్రా ప్రారంభం

New Project (12)

తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రారంభమైంది. అక్టోబర్ 18వ తేదీ ఉదయం రాష్ట్రంలోని ఏర్పాటు చేసిన 34 కేంద్రాల్లో కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా జరుగుతోంది. ఆయా సెంటర్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 2 వేల 216 దుకాణాలకు 48 వేల 401 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ. 968. 02 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం.

జిల్లా కేంద్రాలకు దరఖాస్తు దారులు ఉదయాన్నే చేరుకున్నారు. ఎవరికి లక్కీ డ్రా వస్తుందనే ఉత్కంఠ వారిలో నెలకొంది. సమయం సమీపిస్తున్నకొద్దీ. తమకు మద్యం దుకాణం దక్కుతుందా? లేదా? అన్న టెన్షన్‌లో ఉన్నారు. దుకాణాలు వచ్చిన వారు సంబరాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపు దక్కించుకున్నవారు ఎనిమిదో వంతు లైసెన్స్‌ ఫీజును చెల్లించాలి.

రెండేళ్ల కాలపరిమితిలో మూడు నెలలకు ఒకసారి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. నవంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుంది. రంగారెడ్డి డివిజన్‌లో అత్యధికంగా 422 షాపులకు గాను 8,892 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా హైదరాబాద్‌లో 173 షాపులకు 1,499 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో వ్యాపారులు సిండికేట్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో… ఐదు అంతకంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన షాపులకు డ్రా నిలిపివేయనున్నారు.
Read More : మూడో అంతస్తు నుంచి ప్రియురాలిని తోసేశాడు