మా విజేత ఎవరు : ప్రారంభమైన పోలింగ్

ఎన్నడూ లేనంతగా ఉత్కంఠభరితంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఆదివారం(మార్చి 10, 2019) ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్‌లో

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 03:15 AM IST
మా విజేత ఎవరు : ప్రారంభమైన పోలింగ్

ఎన్నడూ లేనంతగా ఉత్కంఠభరితంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఆదివారం(మార్చి 10, 2019) ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్‌లో

ఎన్నడూ లేనంతగా ఉత్కంఠభరితంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు ఆదివారం(మార్చి 10, 2019) ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. ఫిల్మ్ ఛాంబర్‌లో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు నటీనటులు ఫిల్మ్ చాంబర్ కు తరలి వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఫిల్మ్ ఛాంబర్ లో భారీగా పోలీసులను మోహరించారు. నరేష్, శివాజీ రాజా ప్యానల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. గత ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా చేసిన శివాజీరాజా, నరేష్‌లు ఈసారి ప్రత్యర్థులుగా ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం నువ్వా నేనా అన్నట్టుగా నరేష్, శివాజీ రాజా ప్యానల్స్ పోటీ పడుతున్నాయి.

సీనియర్ నటుడు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఇక అదే ప్యానెల్‌లో జనరల్ సెక్రెటరీగా పని చేసిన నరేష్.. శివాజీరాజాకు పోటీగా బరిలోకి దిగారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. సాయంత్రం 5గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాత్రి 8 గంటలకల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 800 వరకు ఓటు హక్కును కలిగి ఉన్నారు.
 
ప్యానెళ్ల విషయానికొస్తే.. శివాజీరాజా వైపు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, హీరో శ్రీకాంత్, రాజీవ్ కనకాల, నాగినీడు, పృథ్వీరాజ్, బెనర్జీ, బ్రహ్మాజీ, యంగ్ హీరోలు తనీష్, రాజ్ తరణ్ సహా 25మంది పోటీ చేస్తున్నారు. నరేశ్‌ ప్యానెల్‌లో జీవిత, రాజశేఖర్‌, శివ బాలాజీ సహా 26మంది సభ్యులతో బరిలోకి దిగారు. ఈ ఎన్నికలను రెండు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నటి హేమ పోటీ చేస్తున్నారు. గత కార్యవర్గంలో జాయింట్ సెక్రటరీగా హేమ సేవలు అందించారు.

ఎన్నికల్లో గెలిచేందుకు ఇరువురూ పోటాపోటీ హామీలు ఇచ్చారు. తమను గెలిపిస్తే రూ.6 వేల పింఛన్‌తో పాటు కళాకారుల పిల్లల వివాహాలకు లక్ష 116 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని, గతంలో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తామని,  నరేశ్‌ ప్రకటించారు. తమను గెలిపిస్తే 50 మంది నటీ నటులకు 6 నెలల పాటు నిత్యవసర సరుకులు ఉచితంగా అందిస్తామని, రూ.7వేల 500 పింఛన్‌ ఇస్తామని శివాజీరాజా హామీ ఇచ్చారు.

మొన్నటి వరకూ మెగా ఫ్యామిలీ మద్దతు తమకే అంటూ ధీమాగా ఉన్న శివాజీరాజాకి చివరి నిమిషంలో గట్టి దెబ్బ తగిలింది. తమ మద్దతు నరేష్ ప్యానల్‌కి ప్రకటించారు మెగా బ్రదర్ నాగబాబు.  ఈ ఎన్నికల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ నరేష్ ప్యానల్‌కే ఉండగా.. నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు బహిరంగంగా మద్దతుని ప్రకటించలేదు.