మధులిక ఆరోగ్యం విషమం : 15 చోట్ల కత్తి గాయాలు

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 12:28 PM IST
మధులిక ఆరోగ్యం విషమం : 15 చోట్ల కత్తి గాయాలు

ప్రేమోన్మాది భరత్ దాడిలో గాయపడిన యువతి మధులిక ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిపారు వైద్యులు. శరీరంలో 15 చోట్ల కత్తి గాయాలు ఉన్నాయని వెల్లడించారు. రక్తం ఎక్కువగా పోయిందని.. చికిత్సకు సహకరించటం లేదంటున్నారు డాక్టర్లు. కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు వైద్యులు. వెంటిలేషన్ పై చికిత్స కొనసాగిస్తున్నారు. మూడు రోజులు గిడిస్తేనే ఏ విషయం చెప్పలేం అంటున్నారు డాక్టర్లు. మెడ భాగంలో లోతైన గాయం అయ్యింది. చేతి వేళ్లు తెగిపోయాయి. కొన్ని నరాలు కూడా కట్ అయ్యాయి. 

చికిత్స కోసం ప్రత్యేక వైద్య బృందం పని చేస్తోంది. అవసరం అయిన ఆపరేషన్లు చేస్తోంది. మధులిక ప్రస్తుతం స్పృహలో కూడా లేదని చెబుతున్నారు డాక్టర్లు. బ్రెయిన్ – వెన్నుపూస మధ్య ఫ్రాక్చర్ అయ్యిందని.. ఆపరేషన్ చేయాలి అంటున్నారు. రెండు, మూడు విడతలుగా శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందన్నారు. శరీరంపై ఉన్న గాయాలు లోతుగా ఉండటంతో.. చికిత్సకు సమయం పడుతుంది అంటున్నా డాక్టర్లు.