‘మ్యాజిక్‌బాక్స్‌ : ట్రైన్ జర్నీలో ఎంటర్ టైన్ మెంట్

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 04:12 AM IST
‘మ్యాజిక్‌బాక్స్‌ : ట్రైన్ జర్నీలో ఎంటర్ టైన్ మెంట్

హైదరాబాద్‌ : సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే బస్ ల కంటే రైలు ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈ క్రమంలో గంటల తరబడి ఒక్కోసారి రోజుల తలబడి రైలు ప్రయాణంలో గడపాల్సి ఉంటుంది. దీంతో బోర్ కొడుతుంది. కానీ ఇకనుండి రైలు ప్రయాణంలో ఎంటర్ టైన్ మెంట్ ఫెసిలిటీని కల్పిస్తోంది రైల్వే శాఖ. రైలు ప్రయాణమంటే గంటలకొద్దీ బోరు కొడుతుందనే భయం అక్కర్లేదని..వినోదాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెబుతోంది దక్షిణ మధ్య రైల్వే. మ్యూజిక్..మూవీస్ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటితో పాటు పలు ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నవారికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు..రైల్వే ఇన్ఫర్మేషన్ వంటి సౌకర్యాలను అందించనుంది మ్యాజిక్ బాక్స్ ద్వారా. 

 

ఇప్పటికే కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (నంబరు 12785)లో రెండు నెలలుగా ప్రయోగాత్మకంగా ‘మ్యాజిక్‌బాక్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది. దీనినే ‘మ్యాజిక్‌బాక్సు’ వై-ఫై ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం అంటారు. కాచిగూడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లలో ఆరు మ్యాజిక్‌బాక్సు పరికరాలనుఅమర్చింది. ఈవ్యవస్థ కొత్తదిల్లీ శతాబ్ది, ముంబయి రాజధాని, లక్నో ఎక్స్‌ప్రెస్‌లలోనే ఉంది. సెల్‌ఫోన్లు/లాప్‌టాప్‌లకు వై-ఫై ద్వారా మ్యాజిక్‌బాక్సుతో అనుసంధానమైతే ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ని ఎంజాయ్ చేయవచ్చు.

మ్యాజిక్‌బాక్సు తో ఇన్ఫర్మేషన్ ఇలా..
ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత వైఫై ఆప్షన్‌కి వెళ్లి అందుబాటులో ఉన్న నెట్‌వర్కులలో ‘మ్యాజిక్‌బాక్సు’ను అనుసంధానం చేయాలి. బ్రౌజర్‌కి వెళ్లి విండో మీద మ్యాజిక్‌బాక్సు డాట్‌ కామ్‌ అని టైపు చేస్తే సరిపోతుంది. మీకు కావాల్సిన..మీరు సెలక్ట్ చేసుకున్నవాటిని ఎంజాయ్ చేయవచ్చు.