సంగతి చూస్తాం : మహర్షి టికెట్ల ధరలు పెంపుపై ప్రభుత్వం సీరియస్

మహర్షి సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వివాదంలో చిక్కుకుంది. మహర్షి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం దుమారం రేపుతోంది. థియేటర్ యజమానుల తీరు

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 08:21 AM IST
సంగతి చూస్తాం : మహర్షి టికెట్ల ధరలు పెంపుపై ప్రభుత్వం సీరియస్

మహర్షి సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వివాదంలో చిక్కుకుంది. మహర్షి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం దుమారం రేపుతోంది. థియేటర్ యజమానుల తీరు

మహర్షి సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు వివాదంలో చిక్కుకుంది. మహర్షి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం దుమారం రేపుతోంది. థియేటర్ యజమానుల తీరు వివాదానికి  దారితీసింది. ప్రభుత్వం పేరు చెప్పి ఏకపక్షంగా టికెట్ల ధరలు పెంచడం రచ్చగా మారింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా టికెట్ ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్  వేసే ఆలోచనలో ఉంది. టికెట్ల ధరల పెంపు అనేది ప్రభుత్వ నిర్ణయం అని మంత్రి స్పష్టం చేశారు. 79 థియేటర్లు టికెట్ ధరలు పెంచినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. టికెట్ల ధరలు  పెంచుకోవచ్చని ప్రభుత్వం చెప్పలేదని మంత్రి తెలిపారు.

కోర్టు ఉత్తర్వుల మేరకు టికెట్ ధరలు పెంచామని మహర్షి సినిమా నిర్మాత దిల్ రాజు అంటున్నారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. అదనపు షో లు వేసుకోవడానికి, టికెట్ ధరలు  పెంచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందని ఆయన అంటున్నారు. మహర్షి సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందు కలకలం రేగింది. దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు. రికార్డులను చెక్ చేస్తున్నారు. అనూహ్యంగా దిల్ రాజు ఆఫీస్ లో ఐటీ సోదాలు జరగడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాగర్ సొసైటీలోని దిల్ రాజు ఆఫీస్ లో ఈ  సోదాలు జరుగుతున్నాయి. 5 బృందాలుగా ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. దీంతో ఆదాయ వ్యయాల లెక్కలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. దిల్ రాజు.. ఇన్ కమ్ ట్యాక్స్ పే చేశారా లేదా అని పరిశీలన చేస్తున్నారు.

మహేష్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి మహర్షి సినిమా నిర్మించారు. మే 9న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిందని చెబుతూ.. సినిమా థియేటర్ల యజమానులు మహర్షి సినిమా టికెట్ల ధరలు అమాంతం పెంచేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.80 నుంచి రూ.110, మల్టీ ఫ్లెక్స్ లలో ఒక్కో టికెట్ పై రూ.50 పెంచారు. ప్రసాద్ ఐమాక్స్ లో 138 రూపాయలున్న టికెట్ ధరను 200 రూపాయలకు పెంచారు.