మహాశివరాత్రి : తెలుగు రాష్ట్రాల్లో ముస్తాబైన శివాలయాలు

తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 03:38 PM IST
మహాశివరాత్రి : తెలుగు రాష్ట్రాల్లో ముస్తాబైన శివాలయాలు

తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను

తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ రోశయ్య పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తారు. యాగశాలలో రుద్రస్వాహకర హోమం, బిల్వార్చన, ప్రబోధకాల పూజ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారీ భద్రతతోపాటు.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ఖమ్మం జిల్లాలోని మధిర శివాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఇక్కడి శివుడు మృత్యుంజయుడిగా పూజలు అందుకుంటున్నారు. వైరా నది తీరాన ఈ శివాలయం వెలసింది.  ఇక్కడ వైరా నది దక్షిణాభిముఖంగా పయనిస్తోంది. దీంతో ఈ ఆలయానికి దక్షిణ కాశీగా పేరు వచ్చింది. 5 రోజుల పాటు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. రేపు(మార్చి 4) అర్థరాత్రి అత్యంత వైభంగా కళ్యాణం నిర్వహిస్తారు.

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీక్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పంచారామ క్షేత్రం శిరోభాగం కావడంతో ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే పంచారామాలు దర్శించుకున్న పుణ్యం వస్తుందని అర్చకులు చెబుతున్నారు. భక్తులకు ప్రసాదాలు, మంచినీళ్ళు, పాలు, మజ్జిగ అందచేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. శివరాత్రి సోమవారం(మార్చి 4) రావడంతో లక్షమంది భక్తులు వస్తారన్న అంచనాతో.. ఏర్పాట్లను భారీగా చేపట్టారు.