విష జ్వరాలు ప్రబలుతున్నా..ఒక్క చావు కూడా లేదంటారా – భట్టి

  • Published By: madhu ,Published On : September 4, 2019 / 09:26 AM IST
విష జ్వరాలు ప్రబలుతున్నా..ఒక్క చావు కూడా లేదంటారా – భట్టి

రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నా..ఒక్క చావు కూడా లేదని మంత్రి ఈటెల చెప్పడం దారుణమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క. పాల్వంచ మండలంలోనే ఒక్క నెలలో 18 మంది చనిపోయారని, ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సింగ్, ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది నియామకాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 04వ తేదీ బుధవారం మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. హాస్పిటల్స్‌లో బెడ్స్ లేక ఒకే మంచంపై ఇద్దరు పేషెంట్స్ ఉన్నారని, సిబ్బంది లేరన్నారు.

కలెక్టర్లు స్పందించి హెల్త్ క్యాంపు పెట్టలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. పరికరాలు లేవని..పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో వాటితో రోగాలు వస్తున్నాయన్నారు. పార్టీ ఓనర్ షిప్ పంచాయతీలో పడి ఈటెల ఇవన్నీ మరిచిపోయారన్నారు. ఈటెల పార్టీలో ఒత్తిడికి గురై విషయాలు చెప్పడం లేదన్న భట్టి..రుణమాఫీ సకాలంలో చేయకపోతే..రైతులు ఇబ్బంది పడుతారని తెలిపారు. 

హైదరాబాదులో విజృంభిస్తున్న జ్వరాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. హోంమంత్రి  మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ లోకేష్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు తగ్గిపోయాని వెల్లడించారు. ఆగస్టులో 62 మందికి డెంగీ ఉంటే..అందరికీ నయమైందన్నారు. జ్వరం అనగానే..డెంగీ లేదా స్వైన్ ఫ్లూ అనుకుంటున్నారని, ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకరావాలని మంత్రి ఈటెల సూచించారు. 
Read More : విష జ్వరాలు : ఉస్మానియా ఆస్పత్రి ఓపీ సమయం పెంపు