Covid-19: రూ.46 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలే.. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

కరోనా నుంచి కొందరు తేలికగా కోలుకుంటుంటే మరికొందరు ఆసుపత్రులలో చేరి లక్షలకు లక్షలు దారపోస్తున్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కొందరు ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు. కరోనా సోకిన వ్యక్తిని బ్రతికించుకునేందుకు కుటుంబ సభ్యులు రూ.46 లక్షలు ఖర్చు చేశారు. అయినా ప్రాణాలతో దక్కలేదు.

Covid-19: రూ.46 లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలే.. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి

Covid 19 (2)

Covid-19: కరోనా నుంచి కొందరు తేలికగా కోలుకుంటుంటే మరికొందరు ఆసుపత్రులలో చేరి లక్షలకు లక్షలు దారపోస్తున్నారు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా కొందరు ప్రాణాలు విడుస్తూనే ఉన్నారు. కరోనా సోకిన వ్యక్తిని బ్రతికించుకునేందుకు కుటుంబ సభ్యులు రూ.46 లక్షలు ఖర్చు చేశారు. అయినా ప్రాణాలతో దక్కలేదు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ పరిధిలోని 16 డివిజన్ ధర్మరానికి చెందిన పోలెబోయిన రాజన్ బాబు (45) వ్యాపారం చేసుకుంటూ హైదరాబాద్ కూకట్ పల్లిలో నివస్తున్నాడు.

కొద్దీ రోజులక్రితం రాజన్ బాబు, భార్య, ఇద్దరు కుమారులకు కరోనా వైరల్ సోకింది. అందరు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే రాజన్ బాబు ఆరోగ్యపరిస్థితి విషమించడంతో అతడిని స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేర్చారు. ఆలా మూడు ఆసుపత్రులు మార్చారు. రోజుకు లక్ష చొప్పున 46 లక్షల రూపాయలను వైద్యం కోసం ఖర్చు చేశారు. చివరకు పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

లక్షలు వెచ్చించినా ఆయన ప్రాణాలు దక్కలేదు. భార్య, ఇద్దరు కుమారులు ఇంకా చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్లాట్ అమ్మారు కుటుంబ సభ్యులు. కాగా, ఇటీవల రాజన్‌బాబు తల్లి, సోదరి కూడా కరోనాతో మృతి చెందారు. కరోనా కాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు బలికావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.