హైదరాబాద్‌ లో ఈ నెల 15 నుంచి ఆర్గానిక్‌ మిల్లెట్‌ ఎక్స్‌పో

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 05:39 AM IST
హైదరాబాద్‌ లో ఈ నెల 15 నుంచి ఆర్గానిక్‌ మిల్లెట్‌ ఎక్స్‌పో

హైదరాబాద్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫుడ్ అన్న మాట విస్తృతంగా వినిపిస్తోంది. హైదరాబాద్ లోని నగరవాసులు మార్కెట్లలో ఆర్గానిక్‌ ఫుడ్‌ కోసం ఎంతో వెతుకుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కూరగాయలను, పండ్లను పండించేటప్పుడు ఎదుగుదల కోసమో, క్రిములను నాశనం చేసేందుకో విపరీతంగా క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అయితే ఎలాంటి పురుగు మందులు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులతో పండించినవే ఆర్గానిక్ ఫుడ్.  
Read Also : ల‌క్ష్మీస్ వీర‌గ్రంథం టీజర్.. తెలుగింటి గ‌డ‌ప‌పై విర‌జిమ్మిన ‘విష‌ం’

మరి ఈ రకమైన ఆహార పదార్ధాలను ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు అమీర్‌పేట్‌లోని కమ్మసంఘం భవనంలో బిగ్‌ మార్కెటీర్‌ ఆధ్వర్యంలో ‘ఆర్గానిక్‌, మిల్లెట్స్‌ ఎక్స్‌పో’ను నిర్వహిస్తున్నారు. ఇందులో అన్నిరకాల ఆహార పదార్థాలతో పాటు చెరకు, చమురు విత్తనాలు, తృణధాన్యాలు, మిల్లెట్లు, పత్తి, పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, టీ, పండ్లు, మాసాలా దినుసులు, పొడి పండ్లు, కూరగాయలు, కాఫీ తదితరాలు ఉంటాయి.  

ఈ ఎక్స్‌ పోలో దాదాపు 50 మంది ఆర్గానిక్‌ ఫుడ్‌ ఉత్పత్తిదారులు తమ సేంద్రీయ పంట ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ఐదు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి 8 గంటల వరకు జరిగే ఈ ఎక్స్‌పోలో ఆర్గానిక్‌, సహజ పంటల తయారీదారులు, రైతులు అందుబాటులో ఉంటారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత వై.వెంకటేశ్వర్‌రావు, అగ్రి ఫ్రెండ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి శివశంకర్‌, డాక్టర్‌ ఖాదర్‌వలీ తదితరులు సంబంధిత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. ప్రజల సమాచారం కోసం ఆర్గానిక్‌, సేంద్రీయ రైతుల విజయగాథలను అక్కడ ప్రదర్శించనున్నారు.
Read Also : రూ.2వేల నోటు కోసం ప్రాణాలతో చెలగాటం