మీ దగ్గరకే వస్తారు : గ్రామాల్లోనూ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్

  • Published By: madhu ,Published On : March 1, 2019 / 03:22 AM IST
మీ దగ్గరకే వస్తారు : గ్రామాల్లోనూ పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్

పెళ్లి చేసుకుంటారు కానీ..రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోరు. ఆఫీసుల చుట్టూ ఎవరు తిరుగుతారు. టైం వేస్ట్ అని అనుకుంటుంటారు.  ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం, చైతన్యం కూడా లేకపోతుండడంతో వివాహ రిజిస్ట్రేషన్‌లు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. గ్రామాల్లో ఈ పరిస్థితి మరి దారుణంగా ఉంటోంది.

ఈ నేపథ్యంలో పెళ్లిళ్ల నమోదును కట్టుదిట్టం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై పెళ్లి జరిగిన రోజే, పెళ్లి జరిగిన విలేజ్ (గ్రామం) పెళ్లి రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. మార్చి నెల నుండే కొత్త విధానం అందుబాటులోకి రానుంది. 
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్

వివాహాల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను సర్కార్ రిలీజ్ చేసింది. కొత్త పంచాయతీ రాజ్ చట్టంలో కూడా దీనిని పొందుపర్చనుంది. కొత్త పంచాయతీ రాజ్ చట్టం నిబంధనల నేపథ్యంలో మార్చి నుండి కొత్త విధానం అమల్లోకి రానుంది. అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో వివాహ రిజిస్ట్రేషన్ ఫాం ఉండనుంది. పంచాయతీ కార్యదర్శులకు వీటిని అప్పగించింది. వివాహాల నమోదుకు వివాహ మెమోరాండం, రిజిస్టర్, సర్టిఫికెట్లను రూపొందించి కార్యదర్శులకు అందచేశారు. దీనిపై గ్రామ కార్యదర్శులకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
Read Also : ఆధార్ అప్ డేట్ : ఇకపై ఆ మూడింటికీ తప్పనిసరి

బాల్య వివాహాలు పెరుగుతుండడంతో దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు, పెళ్లి, ఆహ్వానపత్రిక, ఫొటోలు, ముగ్గురు సాక్షులు అవసరం ఉంటుందని తెలిపింది. మరుసటి రోజు నూతన వధూవరులకు సర్టిఫికేట్ అందచేస్తారు. ఈ నిర్ణయంతో గ్రామాల్లోను వివాహ రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 2002లో ఉమ్మడి రాష్ట్రంలో వివాహ నమోదు చట్టాన్ని తీసుకువచ్చారు. దీన్ని 2008 నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ప్రతి వివాహాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే