తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి : ఆ 4 రోజుల్లో వేల ముహూర్తాలు 

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 09:27 AM IST
తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి : ఆ 4 రోజుల్లో వేల ముహూర్తాలు 

హైదరాబాద్ : మాఘమాసాన్ని శుభాలను తలపిస్తుంది. శుభవార్తలను తీసుకొస్తుంది. ముఖ్యంగా పెళ్లి ముహూర్తాలు మాఘమాసంలోనే ఎక్కువగా ఉంటాయి. అప్పటివరకూ వేచి చూసిన వారు ముహూర్తాలు పెట్టేసుకుని పెళ్లి బాజాలు మ్రోగించేస్తారు. ఈ  క్రమంలో ఫిబ్రవరి లో నాలుగు రోజుల పాటు పెళ్లిళ్లు సందడే సందడిగా జరిపించేసేందు ఆయా కుటుంబాల వారు ఫంక్షన్ హాల్స్ ను బుక్ చేసేసుకున్నారు. 

గృహ ప్రవేశమైనా, వ్యాపారమైనా, ఇంటి నిర్మాణానికి శంకుస్థాపనలైనా..మాఘమాసంలోనే ఎక్కువగా జరుపించుకుంటుంటారు. శుభ ముహూర్తాలకు నెలవైన మాఘ మాసం రాకతో నుంచి తెలుగు రాష్ట్రాల్లో వివాహాల సందడి ప్రారంభమైపోయింది. 2018  డిసెంబరు 30తో అంటే మార్గశిర కృష్ణపక్ష నవమితో పెళ్లిళ్లకు ముహూర్తాలు ముగియటంతో మార్గశిర బహుళ నవమి నుంచి దాదాపు 35 రోజులు శుభకార్యాలకు బ్రేక్ పడింది. మంగళవారం నుంచి (ఫిబ్రవరి 5) మాఘమాసం ఆరంభం కావడంతో తిరిగి శుభముహూర్తాల సీజన్ తిరిగి మొదలైంది. ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో వంటలు చేసేవారికి (కేటరింగ్)భాజా భజంత్రీల వారికి..పంతుళ్లకు..డెకరేషన్ వారికి ఫుడ్ డిమాండ్ ఏర్పడిపోయింది. ఇప్పటికే నెలల ముందే అన్ని బుక్ అయిపోయాయి.