రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు బంద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ-సేవ’ కేంద్రాలు బంద్ అయ్యాయి. డిసెంబర్ 13 నుంచి మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాలు తాత్కాలికంగా పని చేయవు. డేటాబేస్‌ అప్‌గ్రేడేషన్‌,

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 03:00 AM IST
రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవ కేంద్రాలు బంద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ-సేవ’ కేంద్రాలు బంద్ అయ్యాయి. డిసెంబర్ 13 నుంచి మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాలు తాత్కాలికంగా పని చేయవు. డేటాబేస్‌ అప్‌గ్రేడేషన్‌,

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ-సేవ’ కేంద్రాలు బంద్ అయ్యాయి. డిసెంబర్ 13 నుంచి మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాలు తాత్కాలికంగా పని చేయవు. డేటాబేస్‌ అప్‌గ్రేడేషన్‌, వెబ్‌సైట్లో అదనపు ఫీచర్లు జోడిస్తున్నారు. ఈ కారణంగా తాత్కాలికంగా మీ-సేవ కేంద్రాలను బంద్ చేశారు. డిసెంబర్ 13వ తేదీ రాత్రి 7 నుంచి డిసెంబర్ 16 ఉదయం 8 గంటల వరకు మీ-సేవ కేంద్రాలు మూసి ఉంటాయి. డేటా బేస్ సేవలు మరింత అభివృద్ధి చేసేందుకు మూడు రోజుల సమయం పడుతుందని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీ-సేవ కార్యాలయాలను మూసి ఉంచుతున్నట్లు మీ-సేవ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ముందస్తు సమాచారం పంపామన్నారు. మీ-సేవ నిర్వహకులు కూడా ముందుగానే ఈ అంతరాయం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.

డిసెంబర్‌ 16 ఉదయం 8 గంటల నుంచి యథావిథిగా మీ-సేవ కేంద్రాలు ఓపెన్ అవుతాయని, సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు. ఈ విరామానికి ప్రజలు సహకరించాలన్నారు. నిత్యం లక్షలాది మంది ప్రజలు మీ-సేవ కేంద్రాల ద్వారా ఎన్నో ప్రభుత్వ సేవలను నేరుగా పొందుతున్నారు. మూడు రోజుల పాటు మీ-సేవ కార్యాలయాలు పని చేయకపోతే ఇబ్బందులు తప్పవని వర్రీ అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మీ-సేవ కార్యాలయాలు ప్రజా సేవలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చాలా రకాల ధ్రువీకరణ పత్రాలు మొదలు బిల్లుల చెల్లింపు వంటి ఎన్నో సేవలు మీ-సేవ ద్వారా పొందుతున్నారు. విద్యార్థులు, యువత.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం, కరెంటు బిల్లుల చెల్లింపులు, దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలకు.. మీ-సేవ కేంద్రాలు.. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.