మెట్రో రికార్డు బ్రేక్…ఒకే రోజు 70 వేల మంది ప్రయాణం

  • Published By: chvmurthy ,Published On : September 9, 2019 / 04:37 AM IST
మెట్రో రికార్డు బ్రేక్…ఒకే రోజు 70 వేల మంది ప్రయాణం

హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఖైరతాబాద్ మెట్రోస్టేషన్ నుంచి  సెప్టెంబర్8వ తేదీ ఆదివారం 70 వేల మంది రాకపోకలు సాగించారు. ఆదివారం సెలవు రోజు కావటంతో ఖైరతాబాద్ గణనాధుడ్ని దర్శించుకునేందుకు 40 వేల మంది మెట్రో స్టేషన్లో దిగగా…మరో 30 వేల మంది ఎక్కినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లో  మెట్రో రైలు ప్రారంభం నుంచి చూస్తే ఒక స్టేషన్ నుంచి, ఒకేరోజులో ఇంతమంది ప్రయాణించటం ఇదే ప్రధమం అని మెట్రో అధికారులు చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే అమీర్ పేట ఇంటర్ ఛేంజ్ స్టేషన్ నుంచి రోజుకు 40 వేల మందికి మించి ప్రయాణించటంలేదు.  హైటెక్ సిటీ స్టేషన్లోనూ ఇంతకు మించి ప్రయాణికులు ఎక్కలేదు. కానీ  ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు వీటన్నిటి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

భక్తులకోసం ప్రతి నాలుగున్నర నిమిషాలకు ఒక మెట్రో  రైలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఖైరతాబాద్ నుంచి అన్ని వైపులకు వెళ్లేందుకు రాత్రి గం.11-30 చివరి మెట్రో రైలు నడిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆరు అదనపు టికెట్ కౌంటర్లు, అదనపు సిబ్బందిని మెట్రో అధికారులు ఏర్పాటుచేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు.