మెట్రో రికార్డ్ : ఒక్క రోజే 3.65 లక్షల మంది

ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శనివారం(అక్టోబర్ 5,2019) ఒక్క రోజే మెట్రోలో 3.65 లక్షల మంది ప్రయాణించారు. గతంలో 3.06

  • Published By: veegamteam ,Published On : October 6, 2019 / 06:55 AM IST
మెట్రో రికార్డ్ : ఒక్క రోజే 3.65 లక్షల మంది

ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శనివారం(అక్టోబర్ 5,2019) ఒక్క రోజే మెట్రోలో 3.65 లక్షల మంది ప్రయాణించారు. గతంలో 3.06

ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. శనివారం(అక్టోబర్ 5,2019) ఒక్క రోజే మెట్రోలో 3.65 లక్షల మంది ప్రయాణించారు. గతంలో 3.06 లక్షల మంది మెట్రోలో జర్నీ చేశారు. ఆ రికార్డ్ చెరిగిపోయింది. శనివారం ఉదయం 5 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. రాత్రి 12.30 గంటల వరకు నడిచాయి. ప్రతి 3 నిమిషాలకు ఒక రైలుని నడిపారు. ప్రతి రోజు నడిపే రైళ్లకు మరో 6 రైళ్లను చేర్చారు. రోజూ నడిపే దానికన్నా అదనంగా 100 ట్రిప్పులు నడిపారు. మొత్తంగా ట్రిప్పుల సంఖ్య 810కి పెరిగింది. సాధారణ రోజుల్లో మెట్రోలో 2.5లక్షల మంది ప్రయాణం చేస్తారని అధికారులు తెలిపారు.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. గమ్య స్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు క్యూ కట్టారు. శనివారం (అక్టోబర్ 5, 2019)  ఉదయం నుంచి మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో మెట్రోకు ప్రయాణికుల తాకిడి పెరిగిందని మెట్రో అధికారులు తెలిపారు. రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామన్నారు.

సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగించింది. ఉదయం 5 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అర్ధరాత్రి 12.30 గంటల వరకూ అందుబాటులో ఉంటాయి. రెండు మార్గాల్లో మెట్రో రైళ్లను 810 ట్రిప్పులు నడుపుతున్నారు.