దిగివచ్చిన మెట్రో : మౌనిక కుటుంబానికి రూ.20లక్షలు, ఒకరికి ఉద్యోగం

హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి మౌనిక చనిపోయిన ఘటనలో నష్టపరిహారం అంశం కొలిక్కి వచ్చింది. నష్టపరిహారం గురించి ఎల్ అండ్ టీ, మెట్రో రైలు

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 09:20 AM IST
దిగివచ్చిన మెట్రో : మౌనిక కుటుంబానికి రూ.20లక్షలు, ఒకరికి ఉద్యోగం

హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడి మౌనిక చనిపోయిన ఘటనలో నష్టపరిహారం అంశం కొలిక్కి వచ్చింది. నష్టపరిహారం గురించి ఎల్ అండ్ టీ, మెట్రో రైలు

హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులూడిపడి మౌనిక చనిపోయిన ఘటనలో నష్టపరిహారం అంశం కొలిక్కి వచ్చింది. మెట్రో అధికారులు దిగి వచ్చారు. నష్టపరిహారం గురించి ఎల్ అండ్ టీ, మెట్రో రైలు అధికారులు మౌనిక కుటుంబసభ్యులతో చర్చలు జరిపారు. మృతురాలు మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. అలాగే మౌనిక కటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అంతేకాదు మౌనిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాతపూర్వకంగా అధికారులు హామీ ఇచ్చారు. కాగా రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని మౌనిక కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. వారితో చర్చలు జరిపిన మెట్రో అధికారులు.. రూ.20లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

ఆదివారం(సెప్టెంబర్ 22,2019) అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. మెట్రో పిల్లర్ పెచ్చులూడి మౌనిక మీద పడ్డాయి. దీంతో మౌనిక తీవ్రంగా గాయపడి చనిపోయింది. వర్షం నుంచి తలదాచుకునేందుకు మెట్రో స్టేషన్ లో నిల్చోవడం మౌనిక పాలిట మృత్యువైంది. ఈ ఘటన సంచలనం రేపింది. మెట్రో రైలు అధికారుల నిర్లక్ష్యమే మౌనిక మృతికి కారణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మెట్రో జర్నీ సేఫ్టీగా భావించారు నగరవాసులు. మెట్రోలో ప్రయాణం వేగవంతమే కాదు సురక్షితం అని ఫీల్ అయ్యారు. అలాంటి తరుణంలో అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో జరిగిన ఘోరం  ప్రయాణికుల్లో ఆందోళన, అనుమానం నింపింది. నిర్మాణ లోపాలతో మెట్రో రైలు భయపెడుతోంది. పలు చోట్ల వయాడక్ట్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపతున్నాయి. మెట్రో స్టేషన్లలో గోడలకు బీటలు వచ్చాయి. మరుగుదొడ్ల మురుగు రోడ్లపైకి వస్తోంది. ప్రారంభించి రెండేళ్లు కాకుండానే మెట్రో ఒకరిని బలి తీసుకోవడం నగరవాసుల వెన్నులో వణుకు పుట్టించింది. 

గతంలోనూ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లోనే పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. వానాకాల ప్రారంభంలో గాలివానకు రెండో అంతస్తులో పైకప్పుకు ఉన్న సీలింగ్ ఊడి చెల్లాచెదురుగా పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. అమీర్ పేట్ నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎస్కలేటర్ల నుంచి ఎక్కువగాపై అంతస్తులకు చేరుకుంటారు. అయితే ఎస్కలేటర్లకు ఎలాంటి రక్షణ లేదు. పొరపాటున పిల్లలు చేజారితే ఊహకందని ఘోరం జరగడ ఖాయం. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేసినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. అమీర్ పేట్ మెట్రో స్టేషన్ ఘటన తర్వాత అయినా అధికారుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు.

Also Read : బాబోయ్ మెట్రో స్టేషన్లు : ప్రాణాలు తీస్తున్నాయ్