మార్చి మూడో వారంలో హైటైక్ సిటీకి మెట్రో

  • Published By: madhu ,Published On : February 28, 2019 / 01:34 AM IST
మార్చి మూడో వారంలో హైటైక్ సిటీకి మెట్రో

ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న హైటెక్ సిటీకి మెట్రో త్వరలోనే పరుగులు తీయనుంది. అమీర్ పేట – హైటెక్ సిటీకి మార్చి మూడో వారంలో మెట్రో రైలు వెళ్లే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కమిషనర్ ఆఫ్ రైల్వే స్టేఫీ అధికారుల బృందం భద్రతా పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. లోడ్ స్పీడ్, ట్రాక్, ట్రాక్షన్, సిగ్నలింగ్ తదితర వాటిపై పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో రైలు అధికారులు ట్రయల్ రన్స్ కూడా నిర్వహించారు. 

ఇదిలా ఉంటే ఎల్బీనగర్ – మియాపూర్ రూట్‌లో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం విద్యుత్ అంతరాయం కారణంగా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. 52 నిమిషాల్లో రైలు చేరుకోవాల్సి ఉంటే 75 నిమిషాలు పట్టిందని ప్రయాణీకులు పేర్కొన్నారు. పలు స్టేషన్‌లలో కొద్ది సేపు రైళ్లను నిలిపివేశారు. 

అమీర్, పేట- హైటెక్ సిటీ మార్గం మొత్తం 10 కిలోమీటర్లుగా ఉంది. మధురా నగర్, యూసుఫ్ గూడ, జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటి వంటి ముఖ్యమైన 8 ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ కారిడార్ విస్తృతంగా అభివృద్ధి చెందింది. అత్యంత రద్దీగా వుండే హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.