గంటకు 40 కిలోమీటర్లు : మెట్రోరైలు వేగం పెంపు

మెట్రో రైలు వేగం పెరుగనున్నది. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీనికి

  • Published By: veegamteam ,Published On : November 2, 2019 / 04:14 AM IST
గంటకు 40 కిలోమీటర్లు : మెట్రోరైలు వేగం పెంపు

మెట్రో రైలు వేగం పెరుగనున్నది. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీనికి

మెట్రో రైలు వేగం పెరగనున్నది. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రయోగాత్మకంగా ఇప్పటికే వేగం పెంచి నడిపించినట్టు మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. కమిషనర్ ఆఫ్ మెట్రోరైలు సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) దృష్టికి వేగం పెంచే అంశాన్ని ఇప్పటికే మెట్రో రైలు సంస్థ తెచ్చింది. అనుమతులు రాగానే ఫ్రీక్వెన్సీ పెంచనున్నారు. మెట్రో రైల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజు రద్దీ 4 లక్షలు దాటుతోంది. దీంతో వేగాన్ని పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.

అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కోచ్‌లు కిక్కిరిసి పోతుండటంతో వేగం పెంచాలని అధికారలు నిర్ణయించారు. చాలా మంది ప్రయాణికులు మెట్రోరైలు ప్రయాణానికి అలవాటుపడ్డారని అధికారులు తెలిపారు. 

ఆర్టీసీ సమ్మెకు ముందు ప్రతి రోజు రెండు కారిడార్లలో కలిసి 711 ట్రిప్పులు ఆపరేట్ చేసేవారు. సమ్మె ప్రారంభం అయ్యాక 100 ట్రిప్పులు పెంచి 811 ట్రిప్పులు నడిపిస్తున్నారు. అయినప్పటికీ అంచనాకు మించిన ప్రయాణికులతో మెట్రోరైలు కిక్కిరిసిపోతున్నట్టు అధికారులు గుర్తించారు. రద్దీ సమయంలో 3 నుంచి 4 నిమిషాల ఫ్రీక్వెన్సీతో రైళ్లు నడిపిస్తుండగా, సాధారణ సమయాల్లో 6 నిమిషాలకో రైలు నడిపిస్తున్నారు. వేగం పెంచడం ద్వారా మరిన్ని ట్రిప్పులు నడిపించేందుకు అవకాశం ఉంటుందన్నారు.