సెప్టెంబర్ కు జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్స్ లో మెట్రో 

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 07:28 AM IST
సెప్టెంబర్ కు జేబీఎస్-ఎంజీబీఎస్ రూట్స్ లో మెట్రో 

హైదరాబాద్ : నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణీలకు ట్రాఫిక్ కష్టాలు కొంతవరకూ తగ్గాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో మెట్రో సేవలు కొనసాగుతున్న క్రమంలో మరో మార్గంలో మెట్రో అందుబాటులోకి రానుంది. అదే జూబ్లీ బస్ స్టేషన్-ఎంజీబీఎస్ మెట్రో మార్గం. ఈ సౌకర్యం  సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానుంది. కాగా ఈ రూట్ లలో మెట్రో నవంబరుకు పూర్తవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ రెండు నెలల ముందే ఈ మార్గాలలో మెట్రోను అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.  
 

2019 సెప్టెంబర్ నాటికి జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్)-మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్) లో పనులను పూర్తి చేయడానికి దృష్టి సారించింది. 10-km పరిధి గల ఈ మార్గంలో ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన అన్ని నిర్మాణ పనులు పూర్తయినా..ప్రస్తుతం,పైకప్పులు వంటి..ఫినిషింగ్ వర్లుకు పూర్తికావాల్సి ఉంది. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ ,చిక్కడపల్లి, నారాయణగూడాల స్టేషన్లలో పనులు  చివరి దశకు చేరుకున్నాయి. హెచ్ఎంఆర్ఎల్ సీనియర్ అధికారి తెలిపారు.

ఈ క్రమంలో జూన్ నాటికి అన్ని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.అనంతరం ఓవర్ హెడ్ కేబులింగ్, సిగ్నలింగ్ మరియు ఇతర పనులను చేపబడతారు. ఇలా సెప్టెంబర్ నాటికి అన్ని పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 

అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో ప్రారంభించిన తరువాత, 56 కిలోమీటర్ల మెట్రో సేవలు అందుతున్నాయి. కాగా ఢిల్లీ మెట్రో తరువాత హైదరాబాద్ మెట్రో దేశంలో రెండవ అతి పెద్ద మెట్రో కావటం విశేషం. కాగా ప్రతిరోజూ దాదాపు 2.2 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైల్ లో ప్రయాణిస్తున్నారు. వీటిలో  40,000 మంది అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో ప్రయాణిస్తున్నారనీ హెచ్ఎంఆర్ఎల్ అధికారి తెలిపారు.