Harish Rao Letter To Centre: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత.. కేంద్రానికి హరీశ్ రావు లేఖ

కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. తెలంగాణలో రోజుకు 1.5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. ఇవి ఏ మాత్రమూ సరిపోవడం లేదని తెలిపారు. వెంటనే 50 లక్షల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోసులను పంపాలని అన్నారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.

Harish Rao Letter To Centre: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత.. కేంద్రానికి హరీశ్ రావు లేఖ

Harish Rao Letter To Centre

Harish Rao Letter To Centre: కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఉందని చెప్పారు. తెలంగాణలో రోజుకు 1.5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు మాత్రమే పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. ఇవి ఏ మాత్రమూ సరిపోవడం లేదని తెలిపారు. వెంటనే 50 లక్షల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ డోసులను పంపాలని అన్నారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.

తెలంగాణలో 106 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్, 104 శాతం రెండో డోస్ వ్యాక్సిన్ పంపిణీ చేశామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేనంతగా శరవేగంగం జరుగుతోందని హరీశ్ రావు అన్నారు. ఇప్పుడు వ్యాక్సిన్లు డిమాండుకు తగ్గ లేవని చెప్పారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారికి వేస్తోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు. తెలంగాణలో బూస్టర్ డోసు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలనుకుంటున్నట్లు చెప్పారు.

తెలంగాణలో డిమాండుకు తగ్గ ప్రతిరోజు 3 లక్షల డోసులు పంపిణీ చేయగలిగే సామర్థ్యం ఉందని హరీశ్ రావు చెప్పారు. అయితే, వాటిలో సగం మాత్రమే ఇస్తున్నామని, ఇందుకు వ్యాక్సిన్ల కొరతే కారణమని తెలిపారు. అంతేగాక, తెలంగాణలో 2.7 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని లేఖలో హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయా అంశాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే వ్యాక్సిన్లు పంపాలని కోరారు.