మొక్కలు బతకకపోతే ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త : కేటీఆర్

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 11:07 AM IST
మొక్కలు బతకకపోతే ఉద్యోగాలు ఊడుతాయి జాగ్రత్త : కేటీఆర్

హరితహారంలో నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు  మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ..పంచాయితీ రాజ్ సమ్మేళంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..

కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాల తెలంగాణాను 33 జిల్లాలుగా ఏర్పాటు  చేసుకున్నామనీ..12వేల 751 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేశామని..రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పచ్చదనం చాలా అవసరమని సూచించారు. పచ్చదనం కోసం ప్రతీ సంవత్సరం హరితహారం పేరుతో పచ్చదన్నాన్ని పెంచేందుకు కృషి జరుగుతోందని..దీంట్లో భాగంగా నాటిన మొక్కలను బతికించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

హరితహారంలో నాటిన 85 శాతం మొక్కలు బతికేలా..చక్కగా పెరిగేలా అధికారులు..స్థానిక నేతలు కృషి చేయాలని..నాటిని మొక్కలు బతకకపోతే స్థానిక నేతలకు కూడా ఉద్యోగాలు ఊడిపోతాయని హెచ్చరించారు. ఉద్యోగాలు ఊడపీకటం మొదలు పెడితే మొదట టీఆర్ఎస్ నేతల నుంచే ప్రారంభమవుతుందని హెచ్చరించారు.  ప్రజలకు మెరుగైన ఫలాలు అందించాలనే ఉద్ధేశంతోనే పలు సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.

దీంట్లో భాగంగానే కొత్త పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చామన్నారు. కొత్త చట్టాలు కఠినంగా ఉంటాయని తెలిపిన కేటీఆర్ అధికారులు సక్రమంగా పనిచేయకపోతే పదవులు ఊడతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. అటువంటి పరిస్థితి రాకుండా అధికారులు వారి వారి విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

చెత్తను  సంపూర్ణంగా నిర్మూలించేందుకు అందరూ సహకరించాలనీ..ప్రతీ ఒక్కరూ ఇంకుడు కుంతలు నిర్మించుకునేలా స్థానిక నేతలు చొరవచూపాలని సూచించారు. పారిశుద్ధ్యం..పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అటువంటి రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణా మాత్రమేని అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా అధికారులు..నేతలు కృష్టి చేయాలని..పని విషయంలో ఎవ్వరు అలసత్వం వహించినా సహించేది లేదని ఉద్యోగాలు తీసేయటానికి కూడా వెనుకాడేది లేదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు..నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.