ఆర్టీసీ బస్సు చోరీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం : ఎక్కడుందో కనిపెట్టాలని ఆదేశం

  • Published By: veegamteam ,Published On : April 25, 2019 / 12:22 PM IST
ఆర్టీసీ బస్సు చోరీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం : ఎక్కడుందో కనిపెట్టాలని ఆదేశం

ఆర్టీసీ మెట్రో బస్సు చోరీ మస్టిరీగా మారింది. సీబీఎస్ నుండి ఆర్టీసీ మెట్రో బస్సును దుండగులు చోరీ చేశారు. బస్సు చోరీపై రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్సు ఎక్కడుందో కనిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. టోల్ ప్లాజా, బస్టాండ్లు, డిపోల దగ్గర నిఘా పెంచాలని సూచించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

కుషాయిగూడ డిపోకు చెందిన 2009 మోడల్, నంబర్ AP11Z6254 ఆర్టీసీ మెట్రో సిటీ బస్సును మంగళవారం (ఏప్రిల్ 23, 2019)న రాత్రి హాల్ట్ కోసం డ్రైవర్, కండక్టర్ సీబీఎస్ లో ఉంచారు. తిరిగి తెల్లవారుజామున వచ్చి చూసే సరికి బస్సు కనిపించలేదు. రాత్రి సీబీఎస్ నుండి ఆర్టీసీ మెట్రో బస్సును దుండగులు చోరీ చేశారు. కంగుతిన్న డ్రైవర్, కండక్టర్ ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించారు. బస్సు చోరీకి గురైనట్లుగా అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. తుప్రాన్ టోల్ గేట్ దగ్గర సీసీటీవీలో బస్సు దృశ్యాలు రికార్డు అయ్యాయి. బస్సును నాందేడ్ వైపు తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

2016లో అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బస్సులు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనతో ఆర్టీసీ బస్సులకు భద్రత లేదన్న విషయం స్పష్టమైంది. ఇక బస్సులను దాచి పెట్టడం ఎలా అన్న ప్రశ్న ఆర్టీసీలో ఉత్పన్నమవుతుంది. బస్సుల భద్రతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సరైన సెక్యూరిటీ లేకుంటే బస్సులను కాపాడటం కూడా కష్టమవుతుందన్న భావన వ్యక్తమవుతుంది.