వేణుమాధవ్ ఆసుపత్రి బిల్లు చెల్లించి, అంత్యక్రియలకు రూ.2లక్షలు సాయం

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వేణుమాధవ్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. వేణు మృతికి సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 10:46 AM IST
వేణుమాధవ్ ఆసుపత్రి బిల్లు చెల్లించి, అంత్యక్రియలకు రూ.2లక్షలు సాయం

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వేణుమాధవ్ భౌతికకాయానికి నివాళి అర్పించారు. వేణు మృతికి సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తో తనకున్న అనుంబంధాన్ని గుర్తు

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో వేణుమాధవ్ భౌతికకాయానికి నివాళి అర్పించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వేణు మృతికి ఆయన సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తో తనకున్న అనుంబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. వేణు తమ్ముడు లాంటి వాడని, ఇంత చిన్నవయసులోనే మరణించడం బాధాకరం అని వాపోయారు. వేణుమాధవ్ మరణ వార్త తెలియగానే యశోద ఆసుపత్రికి చేరుకున్నారు మంత్రి తలసాని.

వేణు ఇండస్ట్రీకి రాక ముందు నుంచి తనకు తెలుసని, స్నేహం ఉందని మంత్రి తలసాని తెలిపారు. వేణు ఎక్కడున్నా అందరినీ నవ్వించేవాడన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరాడని తెలిపారు. 600 చిత్రాల్లో నటించారని, నంది అవార్డులు తీసుకున్నారని వెల్లడించారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు మంత్రి తలసాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణుమాధవ్ ఆస్పత్రి బిల్లును మంత్రి తలసాని చెల్లించారు. అలాగే అంత్యక్రియలకు కూడా రూ.2 లక్షలు సాయం చేశారు. మొదటి నుంచి వేణుమాధవ్ పడిన కష్టాలు తనకు తెలుసు అని తలసాని చెప్పారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(సెప్టెంబర్ 25,2019) మధ్యాహ్నం 12:21 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు వేణు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 600 సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో అగ్ర కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

మిమిక్రీ పట్ల ఆసక్తి ఉన్న వేణుమాధవ్ కెరీర్ ప్రారంభంలో కేబుల్ ఛానెల్స్‌లో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేశారు. 1996లో సినీ రంగ ప్రవేశం చేశారు. సంప్రదాయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ‘గోకులంలో సీత’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘యువరాజు’ సినిమాలతో టాలీవుడ్‌‌లో టాప్ కమెడియన్‌‌గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ అందరితోనూ నటించారు. ‘వెంకీ’, ‘దిల్’, ‘లక్ష్మీ’, సై, ‘ఛత్రపతి’, ‘జై చిరంజీవ’, ‘పోకిరి’, ‘కృష్ణ’, ‘సింహా’, ‘బృందావనం’, ‘కిక్’, ‘రచ్చ’ సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ‘నల్లబాలు నల్లతాచు లెక్క’, ‘సనత్ నగర్ సత్తి’, ‘టైగర్ సత్తి’.. ఇలా ఎన్నో క్యారెక్టర్స్‌ని తన స్టైల్ కామెడీతో పండించారు.