సింగిల్‌ విండో విధానంలో సినిమా షూటింగులు : ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్లు

సింగిల్‌విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 02:54 AM IST
సింగిల్‌ విండో విధానంలో సినిమా షూటింగులు : ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్లు

సింగిల్‌విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు.

సింగిల్‌విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైనచర్యలు తీసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. చలన చిత్రరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. సినిమా షూటింగ్‌ల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల చుట్టూ రోజుల తరబడి తరగాల్సి వస్తోందని, దీంతో ఎంతో సమయం వృధా అవుతోందని అన్నారు. నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్‌డీసీ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుందన్నారు. వారం రోజుల్లో సింగిల్‌విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

ఆన్‌లైన్ టికెటింగ్ విధానం
రాష్ట్రంలో సుమారు 600 థియేటర్లు ఉన్నాయని, వీటిలో ఎఫ్‌డిసి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని కూడా వీలైనంత త్వరగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని వెల్లడించారు. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానంతో అధిక ధరలకు టికెట్‌ల విక్రయాలను నియంత్రించవచ్చని అన్నారు. ఇది నిర్మాతకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ విధానం వల్ల ఎఫ్‌డీసీకి కూడా ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. అదే విధంగా ఆర్టీసీ బస్టాండ్‌లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.